ఎంతో ఆశతో దగ్గరకి వచ్చే ఫ్యాన్స్ తో రూడ్ డా బిహేవ్ చేస్తున్నారు కొంత మంది బాలీవుడ్ స్టార్స్. మరీ ముఖ్యంగా షారుఖ్ ఖాన్ చాలా సార్లు ఇలా చేశారు... తాజాగా మరోసారి తన అభిమానిపై ప్రతాపం చూపించారు బాలీవుడ్ బాద్ షా.
కొంత మంది బాలీవుడ్ స్టార్స్ బిహేవియర్ వల్ల ఫ్యాన్స్ బాగా హర్ట్ అవుతున్నారు. హిట్లు వచ్చినా.. ప్లాప్ లు వచ్చినా.. తమ అభిమాన హీరోని అమితంగా ప్రేమించే అభిమానుల పట్ల.. స్టార్లు నడుకునే తీరు.. ఒక్కోసారి ఇండస్ట్రీలో మాట్ టాపిక్ అవుతుంటుంది. తాజాగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కూడా ఇలానే చేశారు. ఆయన వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతున్న టైమ్ లో కాని.. తన కొడుకు డ్రగ్స్ కేస్ లో ఇబ్బందులు పడ్డప్పుడు కాని.. అభిమానులు అండగా నిలిచారు. కాని షారుఖ్ మాత్రం తన అభిమానులను పూచిక పుల్లలా చూస్తాడు అనడానికి తాజాగా ముంబయ్ ఎయిర్ పోర్ట్ లో జరిగిన సంఘటనే సాక్ష్యం.
వరుసగా దెబ్బలు తిన్న షారుఖ్ కు .. పఠాన్ సినిమా ఊపిరి పోసింది. బ్లాక్ బస్టర్ సక్సెస్ ను ఇవ్వడంతో పాటు.. షారుఖ్ కు స్టామినా ఇచ్చింది. ఆ ప్రభావంతోనే వరుస సినిమాలు సెట్స్ ఎక్కించాడు బాద్ షా ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. చాలా గ్యాప్ తరువాత వచ్చిన ఈ భారీ సక్సెస్ ని అలాగే ముందుకు తీసుకు వెళ్లేలా తదుపరి సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమాలు చేస్తున్నాడు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుఖ్ చేస్తున్న సినిమా డంకీ.
ఈ సినిమా షూటింగ్ చాలా రోజులు కాశ్మీర్ లో జరిగింది. ఈ షూటింగ్ నిమిత్తం గత వారం షారుఖ్ కాశ్మీర్ వెళ్లిన ఈ హీరో తాజాగా అక్కడి నుంచి ముంబై తిరిగి వచ్చాడు. ఇక ముంబై ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయిన షారుఖ్ కి స్వాగతం పలికేందుకు కొంతమంది అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ లోపల నుంచి బయటికి వస్తున్న షారుఖ్ తో సెల్ఫీ తీసుకునేందుకు ఒక అభిమాని ట్రై చేశాడు. అయితే షారుఖ్ అతడి చేతిని పక్కకి నెట్టేశాడు. సెల్ఫీ ఇవ్వడానికి నిరాకరించి అక్కడి నుంచి కారులో ఎక్కి వెళ్ళిపోయాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ఇక దాంతో షారుఖ్ పై రకరకాల విమర్షలు వస్తున్నాయి. అభిమానులు లేకుంటే మీరెక్కడ ఉన్నారు. నిన్ను ఇబ్బంది పెట్టకుండా.. ఒక్క సెల్ఫీ కోసం అడిగిన అభిమానిపై ఇలా చేయి యేసుకోవడం కరెక్ట్ కాదు అంటున్నారు అభిమానులు. రకరాలుగా షారుఖ్ ను ట్రోల్ చేస్తున్నారు. ఇక షారుఖ్ ఖాన్ డంకీతో పాటు.. అట్లీ డైరెక్షన్ లో జవాన్ సినిమా కూడా చేస్తున్నాడు. ఈసినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్ సేతుపతి ఇంపార్టెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు.
