Pathaan Collections: `కేజీఎఫ్2` రికార్డులు బ్రేక్.. తొలి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?
షారూఖ్ ఖాన్ నటించిన `పఠాన్` మూవీ రికార్డుల మోత మోగిస్తుంది. ఈ సినిమా `కేజీఎఫ్ 2`, `బాహుబలి2` రికార్డులను బ్రేక్ చేయడం విశేషం. బాలీవుడ్‌తో సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది.

షారూఖ్ ఖాన్ నటించిన `పఠాన్` సినిమా బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇండియాలోనూ తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ దీన్ని డబ్ చేసి రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమా విశేష ఆదరణ దక్కుతుంది. దాదాపు ఐదేళ్లుగా హిట్ లేని షారూఖ్‌కి మైండ్ బ్లోయింగ్ కమ్ బ్యాక్‌నిచ్చింది. అదిరిపోయే బౌన్స్ బ్యాక్‌నిచ్చిందని చెప్పొచ్చు. ఈ చిత్రం కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టింది. ఈ సినిమా తొలి రోజు రూ.106 కోట్లు వసూలు చేసింది. బాలీవుడ్‌లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది.
అయితే ఇది `కేజీఎఫ్ 2` రికార్డులు బ్రేక్ చేయడం విశేషం. అది వరల్డ్ వైడ్‌గా కాదు, హిందీ మార్కెట్‌లో. హిందీలో `కేజీఎఫ్2` చిత్రం అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇది దాదాపు రూ.53కోట్లకుపైగా వసూలు చేసింది. `బాహుబలి2`ని మించి కలెక్ట్ చేయడం విశేషం. దీంతో ఆ రికార్డులను `పఠాన్` బ్రేక్ చేసింది. ఈ చిత్రం హిందీలో ఏకంగా రూ.55కోట్లు వసూలు చేయడం విశేషం. దీంతో సరికొత్త సంచలనం సృష్టించిందని చెప్పింది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ లోనే సుమారు రూ. 60కోట్లకుపైగా వచ్చాయని ట్రేడ్ వర్గాల టాక్.
భారీ యాక్షన్ సీన్లు, సల్మాన్ గెస్ట్ అప్పీయరెన్స్, ఆయన కామెడీ, దీపికా పదుకొనె గ్లామర్, హాలీవుడ్ స్టయిల్ యాక్షన్ ఎపిసోడ్లు, జాన్ అబ్రహం రోల్, బీజీఎం మోత ఈ సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాయి. ఇందులోనూ ఎలివేషన్లు అదిరిపోయాయి. కంటెంట్ పరంగా యావరేజ్‌గానే ఉన్నా, మిగిలిన అంశాల డోస్ పెరగడంతో సినిమాకి విశేష స్పందన లభిస్తుంది. ఇక షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో దీపికా పదుకొనె కథానాయికగా నటించింది. జాన్ అబ్రహం విలన్ పాత్ర పోషించారు. సల్మాన్ ఖాన్ గెస్ట్ గా నటించారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా, యష్ రాజ్ ఫిల్మ్స్ పై ఈ సినిమా తెరకెక్కింది.