Asianet News TeluguAsianet News Telugu

గ్రాండ్ గా సల్మాన్ ఖాన్ బర్త్ డే పార్టీ.. సందడి చేసిన బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.

అభిమానులకు కనుల వింధు చేశారు బాలీవుడ్  స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్. సల్మాన్ బర్ డే సందర్భంగా జరిగిన పార్టీలో సందడి చేుశారు స్టార్స్. 

Shah Rukh Khan in Salman Khan Birthday Party
Author
First Published Dec 27, 2022, 5:49 PM IST

బాలీవుడ్  కండల వీరుడు.. సల్మాన్ ఖాన్ బర్త్ డే పార్టీ గ్రాండ్ గా జరిగింది. ఈరోజు  తన 57వ పుట్టిన రోజు సందర్భంగా నిన్న రాత్రి నుంచే  ఘనంగా జరుపుకున్నాడు సల్మాన్ ఖాన్. ఆసారి సల్మాన్ ఖాన్ బర్త్ డే సెలబ్రేషన్స్ ను ఆయన సోదరి  అర్పితా ఖాన్ శర్మ నిర్వహించారు.  గత రాత్రి తన నివాసంలో ఆమె తన అన్న బర్త్ డే పార్టీని ఘనంగా ఏర్పాటు చేసింది. ఈ పార్టీకి పూజా హెగ్డే తో పాటు.. బాలీవుడ్ ప్రముఖులు ఎంతో మంది హాజరయ్యారు. 

ఇక బర్త్ డే బాయ్ ఈ పార్టీలో మెరిసిపోయాడు. కంప్లీట్  బ్లాక్ అవుట్‌ఫిట్‌  డ్రెస్ ను వేసుకున్న సల్మాన్ ఖన్.. కుర్రహీరోలను మించిన హ్యాండ్సమ్ నెస్ తో  ఉత్సాహంగా కనిపించాడు. ఇక ఇదంతా ఒక ఎత్తైతే..  ఈ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్ తన  స్నేహితుడు, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. చాలా కాలం తరువాత ఇద్దరు ఖాన్ లు.. తమ అభిమానులకు కనుల విందు చేశారు. ఇద్దరూ కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. ఇక ఈఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఖాన్ ఫ్యాన్స్ నెట్టింట సంబరాలు చేసుకుంటున్నారు. పిక్స్ ను ఇంకా వైరల్ చేస్తున్నారు. 

 

ఇక బాలీవుడ్ బాయ్ జాన్.. సల్మాన్ సెలబ్రేషన్స్ కు బాలీవుడ్ నుంచి  జాన్వీకపూర్, కార్తీక్ ఆర్యన్, సోనాక్షి సిన్హా, సునీల్ శెట్టి తో పాటు మరికొందరు తదితర సెలబ్రిటీలు తరలివచ్చారు.  పార్టీకి చిట్టచివరగా వచ్చిన షారుఖ్ బర్త్ డే బాయ్.. తన ప్రాణ స్నేహితుడు  సల్మాన్ ఖాన్ మాధిరిగానే ఆయన ధరించినట్టుగానే బ్లాక్ అవుట్‌ఫిట్‌తో వచ్చాడు. ఇద్దరూ చేతులు కలిపి ఫొటోలకు పోజులివ్వగా.. అవి వైరల్ అవుతున్నాయి.  

అంతే కాదు పార్టీ అయిపోయాక బయటకు వచ్చి షారుఖ్ కు సెండ్ హాఫ్ ఇచ్చాడు సల్మాన్. ఇద్దరు 5 నిమిషాల వ్యవధిలోనే ఓ పది సార్లు హగ్ చేసుకుని తమ స్నెహం ఎంత బలమైనదో చెప్పే ప్రయత్నం చేశారు. వీరిద్దరు ఇలా వదలలేక హగ్ చేసుకోవడం అందరిని ఆశ్చర్య పరిచింది. ప్రస్తుతం ఈ విడియో నెట్టింట వైరల్ అవుతోంది.  ఇక వీరితో పాటు సల్మాన్ సోదరి.. అర్పిత తన భర్త ఆయుష్ శర్మ, పిల్లలతో కలిసి పార్టీలో సందడి చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios