షారుఖ్ ఖాన్ పై సంచలన కామెంట్స్ చేసింది.. ఆయన గారాల కూతురు సుహానా ఖాన్. తన తండ్రి వారసత్వం తనకు అక్కర్లేదంటోంది. ఇంతకీ ఆమె ఈ వాఖ్యలు ఎందుకు చేసింది.
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ అటు సిల్వర్ స్క్రీన్ పైన.. ఇటు పర్సనల్ లైఫ్ లో కూడా కింగ్ లాగే బ్రతుకుతున్నాడు. ఆమధ్య డ్రగ్స్ కేసులాంటివి.. కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినా.. వరుస ప్లాప్ లు తన కెరీర్ ను మసకబార్చినా.. రెట్టింపు స్పీడ్ తో పైకి లేచాడు షారుఖ్ ఖాన్. పఠాన్ సినిమాతో వెయ్యి కోట్ల సినిమాను బాలీవుడ్ కు అందించిన షారూఖ్.. తన కొడుకుపై ఉన్న కేసులలో క్లీన్ చిట్ తెచ్చుకుని ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నాడు.
ఇక అసలు విషయానికి వస్తే.. షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ గురించి అందరికి తెలిసిందే. త్వరలోనే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి కూడా రెడీ అవుతోంది బ్యూటీ.. అంతే కాదు.. అప్పుడప్పుడు హాట్ హాట్ ఫోజులిస్తూ.. కుర్రాళ్లను ఇప్పుడే తనవైపు తిప్పుకుంటోంది. బాలీవుడ్ దర్శకురాలు జోయా అఖ్తర్ డైరెక్ట్ చేస్తున్న ది ఆర్చీస్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది సుహానా.అయితే తాజాగా సుహానా ఖాన్ తన 23వ పుట్టినరోజు( మే22) జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన సుహానా.. షారుఖ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.
తన తండ్రి వారసత్వం తనకు వద్దంటోంది సుహానా.. షారుఖ్ ఖాన్ కూతురుగా గుర్తింపు తనకి అవసరం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది సుహానా. తనకు 5 ఏళ్ళ వయసు వచ్చే వరకు తన తండ్రి షారుఖ్ ఖాన్ స్టార్ అనే విషయమే తనకు తెలియలేదంటోంది. అయితే ఒకసారి తనని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి షారుఖ్ ఖాన్ వెళ్ళినప్పుడు.. అందరూ తననే చూస్తూ ఉన్నారు అంటా. షారుఖ్ ఖాన్ కూతురిగా నా మీద దృష్టి పెట్టడం మొదలు పెట్టారట. అయితే ఆ విషయంలో ఏ పిల్లలైనా గర్వంగా ఫీల్ అవుతారు. తమ తండ్రి గొప్పతనం తలుచుకుని సంతోషపడతారు.
కాని సుహానాకు మాత్రం అది నచ్చలేదంటోంది. వెంటనే నేను మా నాన్నని కారులోకి నెట్టేశాను. అప్పుడే నాకు నేనుగా నిర్ణయించుకున్నా.. మా నాన్న వల్ల వచ్చే గుర్తింపు నాకు అవసరం లేద అని చెప్పుకొచ్చింది బ్యూటీ. దాంతో సుహానా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా మంది రకరకాలు గా కామెంట్స్ చేస్తున్నారు. తన తండ్రి గొప్పతనం కూడా చెప్పుకోలేనంత గొప్పదానివి అయిపోయావా అని కొందరు నెగెటీవ్ గా స్పందిస్తుంటే.. మరికొంత మంది మాత్రం గుడ్.. నీకాళ్ల మీద నువ్వు సొంతంగా నిలబడాలని ప్రయత్నం చేస్తున్నావు, నీ తండ్రి వారసత్వాన్ని అడ్డు పెట్టుకుని ఇండస్ట్రీలోకి రావాలని నువ్వు అనుకోవడంలేదు అని పొగిడేస్తున్నారు.
ఇక షారుఖ్ ఖాన్ విషయానికి వస్తే.. జీరో సినిమాతో ధారుణంగా పడిపోయి...నాలుగేళ్లకు పైగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన షారుఖ్ ఖాన్.. ఈ మధ్య పఠాన్ సినిమాతో బాలీవుడ్ కు ఊపిరి పోశాడు. పఠాన్ సినిమాతో వెయ్యికోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టాడు. ఇక ప్రస్తుతం జవాన్ , డంకీ సినిమాల్లో నటిస్తున్నాడు. జవాన్ సినిమాని సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్ట్ చేస్తున్నాడు. డంకీ సినిమాను PK, 3 ఇడియట్స్ లాంటి బ్లాక్ బస్టర్స్ తెరకెక్కించిన హిరానీ డైరెక్ట్ చేస్తున్నాడు. పఠాన్ వంటి బ్లాక్ బస్టర్ తరువాత షారుఖ్ నుంచి వస్తున్న సినిమాలు కావడంతో వీటి పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాలతో పాటు సల్మాన్ ఖాన్ టైగర్ 3 లో గెస్ట్ రోల్ కూడా చేస్తున్నాడు షారుఖ్.
