Asianet News TeluguAsianet News Telugu

లైంగిక వేధింపుల కేసులో డైరెక్టర్ అరెస్ట్.. సినిమా పరిస్థితి ఏంటి..?

మాలీవుడ్ మూవీ బ్రో డాడీ అసిస్టెంట్ డైరెక్టర్ మన్సూర్ రషీద్ లైంగిక వేధింపుల కేసులో అరెస్టయ్యాడు.

Sexual assault case Bro Daddy assistant director Mansoor Rasheed arrested JmS
Author
First Published Sep 12, 2024, 6:10 PM IST | Last Updated Sep 12, 2024, 6:10 PM IST

పృథ్వీరాజ్ సుకుమారన్, మోహన్‌లాల్‌లు నటించిన మాలీవుడ్  సినిమా బ్రో డాడీ అసిస్టెంట్ డైరెక్టర్ మన్సూర్ రషీద్ లైంగిక వేధింపుల కేసులో అరెస్టయ్యాడు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి కోర్టులో లొంగిపోయిన రషీద్‌కు 14 రోజుల రిమాండ్‌ విధించారు.......

హైదరాబాద్‌లో బ్రో డాడీ చిత్రీకరణ సందర్భంగా దాడి జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. రషీద్ తనకు కూల్ డ్రింక్ లో  మత్తుమందు కలిపి ఇచ్చి, తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, ఆతరువాత  తన నగ్న చిత్రాలను తీసి, ఆపై డబ్బు  ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడని ఆమె ఆరోపించారు. అంతే కాదు చాలా సార్లు తన దగ్గర డబ్బులు వసూలు చేశాడని మహిళ ఆరోపించింది.

రషీద్ ప్రస్తుతం సంగారెడ్డి  జైలుకు తరలించారు. ఆయన ముందస్తు బెయిల్‌ను కూకట్‌పల్లి కోర్టుతో పాటు తెలంగాణ హైకోర్టు కూడా తిరస్కరించాయి. ఈ నేపథ్యంలో గచ్చిబౌలి పోలీసులు అతని బెయిల్ దరఖాస్తును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు.

లూసిఫర్ మరియు అరవిందంటే అతిధికల్‌తో సహా పలు ప్రముఖ మాలీవుడ్ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన రషీద్, పృథ్వీరాజ్ రాబోయే చిత్రం L2: ఎంపురాన్‌ కు కూడా పనిచేస్తున్నాడు. . అయితే, పృథ్వీరాజ్ ఆరోపణల గురించి తెలుసుకున్న వెంటనే అతన్ని ప్రాజెక్ట్ నుండి తొలగించారు.

ఇక రషీద్ విషయంలో ఫృద్విరాజ్ టీమ్ స్పందించారు. పృథ్వీరాజ్ కు  ఇంతకుముందు రషీద్ ఇలాంటి పనులు చేస్తాడని తెలియదంటూ ప్రకటన ఇచ్చారు. ఈ విషయాలు తెలిసిన వెంటనే అతన్ని టీమ్ నుంచి తొలగించినట్టు వెల్లడించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios