మలయాళ యంగ్ హీరో  ఉన్ని ముకుందన్‌కు కేరళ హైకోర్టు షాకిచ్చింది. లైంగిక వేధింపుల కేసులో.. హీరోపై ఇచ్చిన స్టే ఆర్డర్‌ను నిలిపివేసింది. 

మలయాళ యంగ్ హీరో.. యశోద ఫేమ్ ఉన్ని ముకుందన్‌కు కేరళ రాష్ట్ర హైకోర్టు షాకిచ్చింది. ఉన్ని ముకుందంపై ఇప్పటికే ఉన్న లైంగిక వేధింపుల కేసులో.. ఇచ్చిన స్టే ఆర్డర్‌ను హైకోర్ట్ నిలిపేసింది. గతంలో ఉన్ని ముకుందంతో బాధితురాలు చేసుకున్న ఒప్పందానికి సబంధించి ఎటువంటి ఆధారాలులేకపోవడంతో.. గతంలో ఇచ్చిన తీర్పును కొట్టిపారేసింది ఈమేరకు కేరళ హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 

ఇక అసలు విషయానికి వస్తే.. ఉన్ని ముకుందన్‌ పై గతంలో ఓ యువతి లైంగిక వేదింపుల కేసు పెట్టింది. యంగ్ హీరో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని.. కేరళ రాష్ట్రంలోని కొట్టాయం పట్టణానికి చెందిన ఓ యువతి 2018 లో పోలీసులను ఆశ్రయించింది. తనను స్టోరీ డిస్కర్షన్ అని పిలిపించుకుని.. తనతో అసభ్యంగా ప్రవర్తించాడని..లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ.. తన ఫిర్యాదులో పేర్కొంది. ఉన్ని ముఖుందన్ పై కోర్టుకెక్కింది. 

ఈ కేసులో యంగ్ స్టార్ ఉన్ని ముకుందన్‌ తరఫున వివాదాల న్యాయమూర్తి సైబీ జోస్‌ కిడంగూర్‌ వాదించాడు. ఈ కేసు క్రమంలో.. బాధిత యువతి కోర్టు బయట కేసును పరిష్కరించుకునేందుకు అంగీకరించినట్లుగా ఒక ఫోర్జరీ పత్రాన్ని కోర్టుకు సమర్పించాడు. దీంతో సదరు యువతి వేసిన లైంగిక వేధింపుల కేసును హైకోర్టు కొట్టిపారేసింది. దాంతో అప్పటిటో ఆ కేసు ముగిసిపోయినట్టే భావించారు అంతా. అయితే ఈ కేసును తాజాగా రీ ఓపెన్ చేసింది హైకోర్ట్. 

తాజాగా బాధిత యువతి హై కోర్డ్ ను ఆశ్రయించింది. ఈ కేసులో తను ఎలాంటి సంతకం చేయలేదని ఆ యువతి తాజాగా కోర్టులో వాంగ్మూలం ఇచ్చింది. దీంతో తప్పుడు పత్రాలు చూపించి కేసును తప్పుదోవ పట్టించాలని చూసినందుకు లాయర్‌ సైబీ జోస్‌ కిడంగూర్‌పై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇది తీవ్రమైన చర్య అని..దీనిపై సమాధానం చెప్పాలని సైబీని ఆదేశించింది. ఈ కేసులో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఉన్ని కృష్ణన్‌ను ఆదేశిస్తూ కేసును ఈ నెల 17కి వాయిదా వేసింది.

ఇక ఉన్ని ముకుందన్ గురించి చూసుకుంటే.. మలయాళంలో ఆయన స్టార్‌ హీరో. మలయాళంతో పాటు తెలుగులోను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు ఉన్ని ముకుందన్. తాజాగా యశోద మూవీలో నెగెటీవ్ రోల్ లో కనిపించి మెప్పించాడు ఉన్ని ముకుందన్. మలయాళంలో హీరోగా కొనసాగుతన్న ఆయన ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన జనతా గ్యారేజి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయయ్యాడు. ఆ తర్వాత భాగమతి, ఖిలాడీలాంటి సినిమాలతో మంచిపేరు తెచ్చుకున్నాడు. తాజాగా మాలికాపురం సినిమాతో మలయాళ ఆడియన్స్ ను పలకరించిన ఈ హీరో..అక్కడ బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు.