Asianet News TeluguAsianet News Telugu

‘మన్మథుడు’కి సీక్వెల్.. హీరో ఎవరు?

అక్కినేని వారి హోం బ్యానర్ తరఫు నుంచినే ‘మన్మధుడు-2’ టైటిల్ రిజిస్టర్ అయినట్టుగా తెలుస్తోంది. టైటిల్ ను బట్టి మన్మధుడుకు సీక్వెల్ వస్తోందని తెలుస్తోంది.
 

sequel for nagarjuna hit movie manmadhudu ?
Author
Hyderabad, First Published Aug 13, 2018, 4:39 PM IST

అక్కినేని నాగార్జున, సోనాలి బింద్రే హీరో, హీరోయిన్లుగా నటించిన ఆల్ టైం హిట్ సినిమా ‘మన్మధుడు’. ఇందులో నాగార్జున ఆడవారిని ధ్వేషించే పాత్రలో అదరగొట్టేశాడు. ఇక ఈ సినిమాకి మాటల మాంత్రికుడు తివిక్రమ్ అందించిన డైలాగ్స్ ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటాయి. సినిమా ఎంత హిట్టో.. సినిమాలోని పాటలు కూడా అంతే హిట్.

ఇక ప్రస్తుత విషయానికి వస్తే.. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కించాలనే ప్లాన్ లో ఉన్నారట. ఈ మేరకు టైటిల్ కూడా రిజిస్టర్ అయినట్టుగా తెలుస్తోంది. అది కూడా మన్మధుడును నిర్మించిన అక్కినేని వారి హోం బ్యానర్ తరఫు నుంచినే ‘మన్మధుడు-2’ టైటిల్ రిజిస్టర్ అయినట్టుగా తెలుస్తోంది. టైటిల్ ను బట్టి మన్మధుడుకు సీక్వెల్ వస్తోందని తెలుస్తోంది.

అయితే.. హీరో, డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం సస్పెన్స్ గా ఉంది. ఈ వయసులో నాగార్జున మళ్లీ మన్మథుడిగా చేస్తే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువ కాబట్టి.. ఆ ఛాన్స్ నాగార్జున తీసుకోరనే అనుకుందాం. ఇకపోతే ఆయన ఇద్దరు కుమారులు నాగచైతన్య, అఖిల్ లో ఎవరో ఒకరికి ఈ టైటిల్ దక్కే అవకాశం ఉంది. లేకపోతే.. అక్కినేని వారి హోం బ్యానర్ మీద ఇతర హీరోల సినిమాలు కూడా తీస్తారు కాబట్టి.. మరెవరైనా హీరో కోసం ఈ టైటిల్ రిజిస్టర్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. హీరో ఎవరన్న విషయం పక్కనపెడితే.. త్వరలోనే మరో మన్మథుడు ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయమని తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios