మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న రంగస్థలం చిత్రంపై రోజు రోజుకు అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ చిత్రానికి ఉన్న అనేక ప్రత్యేకతల వలన సినీవర్గాలు, అభిమానులు మొత్తం ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. రాంచరణ్ ఈ చిత్రంలో ఛాలంజింగ్ రోల్ పోషిస్తున్నాడు. ఈ చిత్రం గురించి తాజగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వార్త చిత్రంపై అమాంతం అంచనాలు పెంచే విధంగా ఉంది. ఈ చిత్రంలో 1985 నాటి రాజకీయాల ప్రస్తావన ఉంటుందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయాలకు సంబందించిన సన్నివేశాలలో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రస్తావన ఉంటుందనేది లేటెస్ట్ న్యూస్.


రంగస్థలం చిత్రంలో ఉన్న అనేక ప్రత్యేకతలు అందరిని ఆకర్షిస్తున్నాయి. 1985 నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుండడం ఆసక్తిని పెంచుతోంది. 1985 గోదావరి తీర ప్రాంతంలోని ఓ పల్లెటూరి కథగా సుకుమార్ ఈ చిత్రాన్నితెరకెక్కిస్తున్నారు.
రంగస్థలం చిత్రం కేవలం పల్లెటూరి కథ మాత్రమే కాదు. ఈ చిత్రంలో 1985 నాటి రాజకీయ పరిస్థితులని చూపించబోతున్నట్లు తెలుస్తోంది.1985 నాటి మండల స్థాయి రాజకీయ పరిస్థితులని సుకుమార్ కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నాడట.


ఈ చిత్ర రాజకీయ సన్నివేశాలలో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ ప్రస్తావన ఉంటుందని తాజాగా వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక నిజమైనతే రామ్ చరణ్ సినిమాకు అందరూ క్యూ కట్టడం ఖాయం.


దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. 1985 నటి పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకర్షిస్తున్నాడు.