హీరోయిన్ లయ చాలా కాలం తర్వాత ఇండియాలో అడుగుపెట్టారు. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న లయ ఆసక్తికర సంగతులు పంచుకున్నారు.   


హీరోయిన్ లయ సిల్వర్ స్క్రీన్ కి దూరమై చాలా కాలం అవుతుంది. పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిలైన లయ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఆమె ఇండియా వచ్చారు. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. తన మొదటి చిత్రం స్వయంవరం మూవీ గురించి ఆమె ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. స్వయంవరం సినిమా విడుదలయ్యే నాటికి లయ ఇంటర్ చదువుతున్నారట. ఆ మూవీ ఎగ్జామ్స్ టైం లో విడుదలైందట. 

స్వయంవరం రిలీజ్ రోజు ఫిజిక్స్ ఎగ్జామ్ అట. పరీక్ష అయిపోయాక మూవీకెళదాం అని లయ ఫ్రెండ్ అందట. రెండు రోజుల్లో కెమిస్ట్రీ ఎగ్జామ్ ఉంది. చదవకుండా మూవీకి ఎలా వెళతామని లయ అన్నారట. ఏం పర్లేదు. సినిమా చూద్దాం, ఒకవేళ మూవీ ప్లాప్ అయితే థియేటర్ నుండి తీసేస్తారని ఫ్రెండ్ కన్విన్స్ చేసిందట. అలా కెమిస్ట్రీ ఎగ్జామ్ ముందురోజు స్వయంవరం మూవీ థియేటర్లో లయ తన ఫ్రెండ్ తో పాటు చూసిందట. ఆ మూవీ హిట్ అయ్యిందని లయ చెప్పుకొచ్చారు.

View post on Instagram
 

ప్రేమించు మూవీలో లయ అంధురాలి పాత్ర చేశారు. కెరీర్ దెబ్బతింటుంది ఆ చిత్రం చేయ వద్దని కొందరు సలహా ఇచ్చారట. అయితే ప్రేమించు మూవీ తనకు చాలా మంచి పేరు తెచ్చిందని లయ వెల్లడించారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కిన ప్రేమించు లేడీ ఓరియెంటెడ్ మూవీ అని  చెప్పొచ్చు. సాయి కిరణ్ హీరో కాగా సీనియర్ నటి లక్ష్మి కీలక రోల్ చేశారు. లయ హీరోయిన్ గా నటించిన చివరి చిత్రం బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం. 2018లో హీరోయిన్ తల్లిగా అమర్ అక్బర్ ఆంటోని చిత్రం చేశారు. తన కూతురు శ్లోక కు ఆసక్తి ఉంటే నటిగా ప్రోత్సహిస్తానని లయ చెప్పడం విశేషం. 

 2006లో అమెరికాలో డాక్టర్ గా స్థిరపడిన గణేష్ గోర్తి తో లయ వివాహం జరిగింది. వీరికి ఒక అమ్మాయి అబ్బాయి సంతానం. కొన్నాళ్ళు అమెరికాలో ఐటీ ఉద్యోగ్యం కూడా చేశారట. ఇక విజయవాడకు చెందిన లయ దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ గా కొనసాగారు. బాలయ్య వంటి టాప్ స్టార్ తో కూడా జతకట్టారు. 

View post on Instagram