Asianet News TeluguAsianet News Telugu

శ్రీకాంత్ కూతురిగా జాన్వీ కపూర్.. క్రేజీ న్యూస్ లో నిజం ఎంత..?

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తండ్రి పాత్రలో.. టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ న్యూస్ లో నిజం ఎంత...? 

Senior Hero Srikanth Janhvi Kapoor Father Role In NTR Devara Movie JMS
Author
First Published Jan 2, 2024, 1:53 PM IST

ప్రస్తుతం సౌత్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది బాలీవుడ్ బ్యూటీ..జూనియర్ శ్రీదేవి జాన్వీ కపూర్. ఎన్టీఆర్ జోడీగా కొరటాల శివ తెరకెక్కిస్తోన  దేవర సినిమా ద్వారా తెలుగు సినిమాలోకి అడుగు పెట్టిందిజాన్వీ కపూర్. బాలీవుడ్ లో ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ వెళ్తోన్న జాన్వీ సౌత్ లో మాత్రం పక్కా కమర్షియల్ సినిమాలను తీసుకుంటోంది. ఇక ఇప్పటికే దేవర షూటింగ్ చాలా వరకూ అయిపోయింది. జాన్వీ పర్షన్ షూట్ కూడా ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యిందని టాక్. అయితే ఈసినిమాకు సబంధిచిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్అవుతోంది. 

అయితే ఈసినిమాలో పాత్రల గురించి ఇప్పుడిప్పుడే క్లారిటీవస్తోంది. దేవర మూవీపై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ పెరిగేలా ఇప్పుడిప్పుడే లీక్ లు వదులుతున్నారు. తాజాగా న్యూ ఇయన్ సందర్భంగా ఎన్టీఆర్ పోస్టర్ రిలీజ్ చేశారు టీమ్. ఈనెల 8న ఫస్ట్ గ్లింప్స్ ఇస్తామని కూడా చెప్పారు. ఇకపోతే ఈ సినిమాలో నటించిన ఒకరు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దేవర సినిమాకు సబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఓ మీడియాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నట్టు తెలుస్తోంది.  ఈ సందర్భంగా ఈయన చాలా విషయాలు చెప్పారట. తాను ఈ సినిమాలో శ్రీకాంత్ అసిస్టెంట్ గా నటించినట్ట వెల్లడించి వ్యక్తి.. శ్రీకాంత్ క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని వెల్లడించాడు. 

ఈ సినిమాలో శ్రీకాంత్ హీరోయిన్ జాన్వీ కపూర్ కి తండ్రి పాత్రలో నటించబోతున్నారు అంటూ .. అసలు విషయం చెప్పేశారట. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అవ్వడం ఖాయం అని.. అందుకుతగ్గట్టు టీమ్ అంతా బాగా శ్రమిస్తున్నారని.. అందుకే అందరిలో ఆ ధీమా ఉందంటూ.. ఆ వ్యక్తి చెప్పినట్టు తెలుస్తోంది. ఇక అందకు తగ్గట్టే తాజాగా రిలీజ్ చేసిన ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది. ఫస్ట్ గ్లింమ్స్ ఎలా ఉంటుందో చూడాలి. 

 ఈ సినిమా వచ్చేయడాది ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఇప్పటికే ఈమూవీ నుంచి రిలీజ్ చేసిన కొన్ని పోస్టర్స్ వైరల్ అయ్యాయి. పోస్టర్స్ తోనే సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయంటే.. ఇక ఇతర ప్రమోషన్ వీడియోలు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ ఎదరు చూస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios