కరోనా కారణంగా దాదాపు 6 నెలలు సినీ రంగం స్థంబించి పోయింది. సినిమాలకు సంబంధించిన అన్ని పనులు ఆగిపోవటంతో నటీనటులు సాంకేతిక నిపుణులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే లాక్‌ డౌన్‌ సడలింపులు ఇస్తుండటంతో సినీ వర్గాలు కూడా షూటింగ్‌లు మొదలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో షూటింగ్‌కు హాజరైన సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌, తన అనుభూతిని అభిమానులతో పంచుకున్నాడు.

శనివారం జైపూర్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ తమిళ చిత్ర షూటింగ్‌లో రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నాడు. అక్కడి నుంచి తన ఆనందాన్ని వీడియో మెసేజ్‌ రూపంలో షేర్‌ చేశాడు రాజేంద్రుడు. విజయ్‌ సేతుపతి, తాప్సీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తమిళ చిత్రాలో తాను హీరోయిన్‌ తండ్రి పాత్ర పోషిస్తున్నానని, తన పెయిర్‌గా రాధిక నటిస్తున్నట్టుగా వెల్లడించాడు. ప్రజలు కూడా వీలైనంత త్వరగా అన్ని కార్యక్రమాలు ప్రారంభించే పరిస్థితి రావాలని ఆయన ఆకాంక్షించారు.
"