ప్రముఖ నటుడు రాజన్‌ పి దేవ్‌ కుమారుడు  నటుడు ఉన్ని రాజన్‌ అరెస్ట్ అయ్యారు. భార్యని హింసించి, ఆత్మహత్యకి ఉసిగొల్పిన కేసులో ఆయన్ని కేరళలోని నెడుమంగడ్‌ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. 

ప్రముఖ నటుడు రాజన్‌ పి దేవ్‌ కుమారుడు నటుడు ఉన్ని రాజన్‌ అరెస్ట్ అయ్యారు. భార్యని హింసించి, ఆత్మహత్యకి ఉసిగొల్పిన కేసులో ఆయన్ని కేరళలోని నెడుమంగడ్‌ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని చాలా రోజుల క్రితమే అరెస్ట్ చేయాల్సి ఉండగా, ఆయనకు కరోనా సోకడంతో అది తగ్గేంత వరకు వెయిట్‌ చేసి మంగళవారం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఉన్నిరాజన్​ కమెడియన్​గా, విలన్​గా దాదాపు ముప్ఫై మలయాళ చిత్రాల్లో నటించాడు. 

2019లో ఉన్నికి ప్రియాంకతో వివాహం జరిగింది. ఆమె ఓ స్కూల్​లో టీచర్​గా పని చేస్తోంది. పెళ్లయిన కొన్నాళ్లకే అదనపు కట్నంతో పాటు డిమాండ్‌ చేయడంతోపాటు ఇతర హింసలకు పాల్పడుతూ వచ్చారని, ప్రతీరోజూ హింసించేవాడని ప్రియాంక తల్లి ఆరోపించింది. ఓ రోజు గొడవలో అడ్డువెళ్ళినందుకు తనపై కూడా దాడి చేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆత్మహత్యకు ముందు ప్రియాంక కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మే పదకొండున ఉన్ని ఇంట్లో గొడవ జరిగిందని, వెంటనే పుట్టింటికి ప్రియాంక ఇంటికి వచ్చేసింది. ఆ మరుసటిరోజే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

మలయాళ నటుడు రాజన్​ పి దేవ్ తెలుగులో విలన్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన `ఆది`, `దిల్​`, `ఒక్కడు`, `ఖుషి`, `గుడుంబా శంకర్​` లాంటి సినిమాల్లో నటించి తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యారు. సౌత్‌లో ఆయన 200 సినిమాలకుపైగా నటించారు. 2009లో లివర్​ సంబంధిత వ్యాధితో బాధపడుతూ కన్నుమూశారు. తండ్రి చనిపోయాక జల్సాలకు అలవాటు పడ్డ ఉన్ని, కుటుంబ సభ్యులతో కలిసి డబ్బు కోసమే ప్రియాంకను వేధించినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పుడు ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.