పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోజుల వ్యవధిలో ముగ్గురు బుల్లితెర నటులు కన్నుమూశారు. అనుపమా నటుడు నితీష్ పాండే అకాల మృతి చెందారు.

హిందీ బుల్లితెర పరిశ్రమలో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. రోజుల వ్యవధిలో ముగ్గురు ప్రముఖులు కన్నుమూశారు. ఆదిత్య సింగ్ రాజ్ పుత్ మరణించిన వెంటనే యంగ్ యాక్ట్రెస్ వైభవి ఉపాధ్యాయ ప్రమాదంలో మరణించింది. నేడు నితేష్ పాండే హఠాన్మరణం పొందారు. నితేష్ పాండే వయసు 51 ఏళ్ళు కాగా కార్డియాక్ అరెస్ట్ కి గురయ్యారు. ముంబైలోని ఇగత్ పురిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన నివాసంలో నితేష్ పాండే కార్డియాక్ అరెస్ట్ బారినపడ్డారు. 

రూపాలి గంగూలీ సక్సెస్ఫుల్ టీవీ షోలో ధీరజ్ కపూర్ రోల్ చేసిన నితేష్ పాండే పాపులారిటీ తెచ్చుకున్నారు. 1990లో థియేటర్ ఆర్టిస్ట్ గా ఆయన కెరీర్ మొదలైంది. 1995లో తేజాస్ లో డిటెక్టివ్‌గా నటించాడు. నితేష్ పాండే.. మంజిలీన్ ఆపని ఆపని, అస్తిత్వ...ఏక్ ప్రేమ్ కహాని, సాయా, జస్టజూ, దుర్గేష్ నందిని వంటి సీరియల్స్‌లో కీలక రోల్స్ చేశారు. పలు హిందీ చిత్రాల్లో నటించారు. నితేష్ పాండే ఓం శాంతి ఓం, బదాయి దో చిత్రాల్లో కీలక రోల్స్ చేశారు.అలాగే డ్రీమ్ కాజిల్ ప్రొడక్షన్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థ ఏర్పాటు చేశారు. చివరిసారిగా అనుపమ, ప్యార్ కా దర్ద్ హై మీఠా మీఠా ప్యారా ప్యారా సీరియల్స్ లో నటించాడు. 

దాదాపు 25 ఏళ్లుగా బుల్లితెరపై ఆయన సత్తా చాటుతున్నారు. నితేష్ పాండే మరణవార్త బుల్లితెర వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేశాయి. సోషల్ మీడియా వేదికగా తమ ప్రఘాడ సానుభూతి తెలియజేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. నితేశ్ పాండే ఉత్తరాఖండ్ కి చెందినవారు.