Asianet News Telugu

అస్వస్థతకు గురైన సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా!

నసీరుద్దీన్ షాకు నిమోనియాగా డాక్టర్స్ గుర్తించారు. ఆయన రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వైద్యులు ఆయనకు చికిత్స అందించడంతో పాటు, పర్యవేక్షిస్తున్నారు... అంటూ నసీరుద్దీన్ షా మేనేజర్ మీడియాకు తెలియజేయడం జరిగింది. 

senior actor naseeruddin shah gets illness and hospitalized ksr
Author
Hyderabad, First Published Jun 30, 2021, 12:59 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా అనారోగ్యం పాలయ్యారు. ఆయన శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్స్ ఆయన నిమోనియా బారినపడినట్లు గుర్తించారు. నసీరుద్దీన్ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు డాక్టర్స్ గుర్తించారు. 


నసీరుద్దీన్ తో పాటు ఆయన భార్య రత్న పతక్ షా, పిల్లలు ఉన్నారు. నసీరుద్దీన్ షాకు నిమోనియాగా డాక్టర్స్ గుర్తించారు. ఆయన రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వైద్యులు ఆయనకు చికిత్స అందించడంతో పాటు, పర్యవేక్షిస్తున్నారు... అంటూ నసీరుద్దీన్ షా మేనేజర్ మీడియాకు తెలియజేయడం జరిగింది. 


బాలీవుడ్ లో సుదీర్ఘ చరిత్ర కలిగిన నసీరుద్దీన్ నటుడిగా అనేక మైలురాళ్లు అందుకున్నారు. ఏకంగా మూడు సార్లు నసీరుద్దీన్ షా జాతీయ అవార్డ్స్ అందుకున్నారు. అలాగే పలు ఫిలిం ఫేర్ అవార్డ్స్ ఆయనను వరించాయి. భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్ అవార్డ్స్ తో సత్కరించడం జరిగింది. 

Follow Us:
Download App:
  • android
  • ios