కొమ్ముల అంటూ శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలకు శేఖర్ కమ్ముల కౌంటర్

sekhar kammula counter to sri reddy
Highlights

కొమ్ముల అంటూ శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలకు శేఖర్ కమ్ముల కౌంటర్

తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ పై సినీ నటి శ్రీరెడ్డి ఇప్పుడు సంచలన కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారటమే కాక అంతటా చర్చనీయాంశం అయిపోయింది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పేర్లు చెబుతూ హంగామా చేస్తున్న ఈ యాక్ట్రెస్.. రీసెంట్ గా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ద్వారా పెద్ద సెన్సేషన్ నే క్రియేట్ చేసింది. కొమ్ములు తిరిగిన శేఖరుడు.. అంటూ పేరు చెప్పకుండానే శేఖర్ కమ్ముల అని అర్ధం అయేలా నానా మాటలు అనింది.

తనపై వచ్చిన ఆరోపణలకు ఇప్పుడు శేఖర్ కమ్ముల రియాక్ట్ అయ్యాడు. ఫేస్ బుక్ లో తన పేజ్ లో తెలుగు ఇంగ్లీష్ రెండు భాషల్లోనూ ఓ సుదీర్ఘమైన పోస్ట్ నే పెట్టాడు. ' నన్ను కించపరుస్తూ సోషల్ మీడియాలో నిన్న వచ్చిన పోస్ట్ నా దృష్టికి వచ్చింది. ఆ పోస్ట్ లో ప్రతీ మాట అబద్ధం. అసభ్యం. అవమానకరం. ఆ పోస్ట్ నాకు నా కుటుంబానికి నన్ను గౌరవించేవారికి చాలా మనస్థాపం కలిగించింది. నేను ఎప్పుడూ కలవని అసలు చూడనే చూడని కనీసం ఫోన్లో కుడా మాట్లాడని అమ్మాయి నా గురించి ఆధారం లేని ఆరోపణలు చేయటం షాకింగ్ గా ఉంది. ఈ దిగజారుడు చర్య వెనక ఎవరున్నా వారి ఉద్దేశం ఏమైనా నేను చెప్పదల్చుకున్నది ఒకటే. ఇది తప్పు - నేరం - అనైతికం' అంటూ శ్రీరెడ్డి పేరు చెప్పకుండా తన అభిప్రాయాన్ని చెప్పాడు శేఖర్ కమ్ముల.

'స్త్రీల సమానత్వం సాధికారతలని నేను ఎంత నమ్ముతానో నా సినిమాలు - నా కార్యక్రమాలు చూస్తే అర్ధమౌతుంది. నా వ్యక్తిత్వం - నమ్మే విలువలు నా ప్రాణం కంటే ముఖ్యం. వాటి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే వదిలి పెట్టే ప్రసక్తి లేదు. ఆ పోస్ట్ లోని ప్రతీ మాట తప్పు అని ఒప్పుకొని క్షమాపణ చెప్పకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటాను'  అన్నారు శేఖర్ కమ్ముల.

నిజానికి శేఖర్ కమ్ముల సినిమాలు తీస్తున్న సమయంలో కూడా చాలా సైలెంట్ గా ఉంటాడనే టాక్ ఉంది. తెలుగు అమ్మాయిలను తీసుకోకపోవడం అనే మాటలో అంతో ఇంతో వాస్తవం ఉన్నా.. ఇలాంటి మాటలు ఆరోపణలు ఎప్పుడూ వినిపించలేదు. మరి శ్రీరెడ్డి ఆరోపణ్లో నిజానిజాలేంటో ఆమే చెప్పాలి.

loader