అభిమానం వెర్రితలలు వేయొద్దన్న బ్యూటీ కపూర్ రక్తంతో అభిమానం చాటుకోవడం పైశాచికమని హెచ్చరిక అలా చేయడం అభిమానం వెర్రిగా మారటమేనని చురక
'రన్ రాజా రన్' సినిమాలో శర్వానంద్ సరసన హీరోయిన్‌గా నటించిన హీరోయిన్ సీరత్ కపూర్. ప్రస్తుతం 'రాజుగారి గది' సీక్వెల్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీకి ఇటీవల ఓ చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. సోషల్ మీడియాలో ఓ వీరాభిమాని, ఆమె పేరుని తన చేతి మీద చెక్కేసుకున్నాడు. రక్తం వచ్చేట్టు పేరు చెక్కేసుకుని దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సీరత్ కపూర్‌కి మైండ్ బ్లాంక్ అయిపోయింది.
గ్లామర్ ప్రపంచంలోకి రావడం తమ అదృష్టమనీ, అదే సమయంలో తమను అభిమానించే చాలామంది అభిమానుల పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం తమకుందనీ, అందుకే ఎవరూ ఇలాంటి పనులు చేయొద్దనీ, అభిమానాన్ని ప్రదర్శించడానికి ఇది సరైన మార్గం ఎంతమాత్రం కాదని పెద్ద క్లాసే పీకింది. ఈ విషయంలో సీరత్ కపూర్‌ని అభినందించి తీరాలి.
సీరత్‌కపూర్ తీసుకున్న క్లాస్ పట్ల పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, సీరత్ కపూర్ క్లాస్ పీకిన మేటర్‌ని రీ-ట్వీట్ చేస్తూ, అభిమానులెవరూ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడవద్దనీ, అభిమానం చాటుకోవడానికి తమను తాము హింసించుకోవద్దని సూచించింది. అభిమాన నటీనటుల కోసం దేవాలయాలు నిర్మించేయడం, రక్తదానం చేయడం మామూలే. అప్పుడప్పుడూ ఇలాంటి విపరీతపోకడల్నీ చూస్తుంటాం. ఇలాంటి సందర్భాల్లోనే సెలబ్రిటీలు హుందాగా స్పందించాల్సి వుంటుంది.
అన్నట్టు, ఈ మధ్యనే సీరత్ కపూర్ తన బికినీ ఫొటోలతో సందడి చేసింది సోషల్ మీడియాలో. ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. అంతలోనే, ఇదిగో ఇలా ఈ బికినీ బ్యూటీ మీద అతి అభిమానం చాటుకున్నాడో ఔత్సాహికుడు. మొత్తానికి అభిమాని పిచ్చితనాన్ని అర్థం చేసుకుని అలా చేయొద్దని హెచ్చరించింది ఈ బ్యూటీ.
