తొలి మూడు సినిమాలు ఫ్లాఫ్ అవటంతో నాలుగో సినిమాతోనైనా హిట్ కొట్టాలని  కృత నిశ్చయంతో వున్నాడు అక్కినేని యంగ్ హీరో అఖిల్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ ఒక సినిమా చేయబోతున్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ ఫై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అన్నీ బాగానే సెట్ అయినప్పటికీ కథ విషయంలోనే ఇంకా ఓ కొలిక్కి రాలేదని వినపడుతోంది.  ఈపాటికే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లాలి కానీ ఇంకా స్టోరీ రెడీ అవ్వకపోవడంతో హోల్డ్ లో ఉందని తెలుస్తోంది. 

ఈ సినిమా సెకండ్ హాఫ్ తెగటం లేదని, స్క్రిప్టు విషయంలో డైరెక్టర్ భాస్కర్ కు ఇంకా ఓ క్లారిటీ రాలేద‌ని తెలుస్తోంది. ఇప్పటికే ఇండస్ట్రీలో టాప్ అనుకున్న ఇద్దరు ముగ్గురు రైటర్స్ ని కూర్చోబెట్టినా సెకండాఫ్ తేల‌డం లేద‌ని చెప్పుకుంటున్నారు. కథకు క్లైమాక్స్ ఉన్నా ... ఇంటర్వెల్ దగ్గర నుండి ప్రీ క్లైమాక్స్ ముందు వరకు సీన్స్ సరిగ్గా లేదని అంటున్నారు.  భాస్కర్ చెప్పే స్క్రిప్టు అల్లు అరవింద్ ని కన్వీన్స్ చేయలేకపోతున్నాడని టాక్.

అఖిల్ ప్రాజెక్టు లేటు అయ్యేటట్లు ఉందని..‘ముందు చేతిలో ఉన్న సీన్లు తీసేద్దాం’ అని భాస్క‌ర్ ని తొంద‌ర‌పెడుతున్నా… అల్లు అర‌వింద్ మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం లేదట. బౌండ్ స్క్రిప్టు అయ్యాకే మొదలెడదాం అంటన్నారట.  ఎవరూ రిస్క్ తీసుకునే పొజీషన్ లో లేరని చెప్తున్నారు.

ఇక ఈనెల 24న ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభం అవుతుందట. వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేసారట. కానీ అల్లు అరవింద్ మాత్రం స్క్రిప్టు లేని ఈ ప్లానింగ్ కు సముఖంగా లేరట.