జాతిపిత  మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని హీరో షారుక్ ఖాన్ ఓ ట్వీట్ చేయడం జరిగింది. మంచి చెడులలో మన పిల్లలు చెడును చూడడం, మాట్లాడం, వినడం కానీ చేయవద్దని వారికి నేర్పాలని, జాతిపిత గాంధీ మనకు నేర్పిన స్ఫూర్తి ఇదేనని అర్థం వచ్చేలా షారుక్ తన ట్వీట్ లో పొందుపరిచారు. గాంధీ బోధించిన చెడు వినవద్దు, చెడు చూడవద్దు, చెడు మాట్లాడవద్దు అనే నియమాన్ని గుర్తు చేస్తూ షారూక్ చెప్పడం జరిగింది. 

ఈ విషయాన్ని హీరోయిన్ సయాని గుప్త తప్పుబట్టారు. మంచి చెడులు గురించి మాట్లాడాలని పిల్లకు నేర్పాలి అన్నారు. అణగారిన వర్గాలకు చెందిన సోదరులు, సోదరీమణులు అన్యాయానికి గురవుతున్నారని, వారి గురించి మాట్లాడాలని, సత్యం చెప్పాలని, ఇదే గాంధీ కూడా చెప్పారు అన్నారు. షారూక్ ట్వీట్ ని విమర్శిస్తూ సయాని గుప్త వేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

బాలీవుడ్ లో పలు చిత్రాలలో నటించిన సాయాని గుప్త వరుసగా వెబ్ సిరీస్లలో నటిస్తున్నారు. ఇన్సైడ్ ఎడ్జ్, కౌషికి మరియు ఫోరు మోర్ షాట్స్ ప్లీజ్ అనే వెబ్ సిరీస్ లలో సయాని నటించారు. ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. సయాని  ట్వీట్ పై హీరో షారూక్ ఎలా స్పందిస్తారో చూడాలి.