సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలకంటే ఎక్కువగా నష్టపోయేది బయ్యర్లే. సినిమా మంచి ధరకు అమ్ముడుపోతే నిర్మాత ఆల్ మోస్ట్ సేఫ్ అయినట్టే. ఇక శాటిలైట్ ధరలు, డిజిటల్ ధరలు ఎదో విధంగా ప్రొడ్యూసర్ కి లాభాలే వస్తుంటాయి. 

అసలు విషయంలోకి వస్తే. ఇటీవల సవ్యసాచి కొన్న బయ్యర్స్ తీవ్రంగా నష్టపోయారని తెలుస్తోంది. మొదటి రోజే సినిమా టాక్ లో తేడా రావడంతో రెండవరోజు నుంచి కలెక్షన్స్ డౌన్ అయ్యాయి. సినిమాను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ కి ఇది పెద్ద షాక్ అని చెప్పాలి. 

ఎందుకంటే వరుస విజయాలతో ఉపుమీదున్న ఈ ప్రొడక్షన్ హౌస్ సక్సెస్ ట్రాక్ ను సవ్యసాచి తప్పించింది. బయ్యర్స్ నష్టాల భారిన పడటంతో నెక్స్ట్ వవరో సంస్థ నుంచి వస్తోన్న అమర్ అక్బర్ అంథోని సినిమాని నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు డీసెంట్ రేట్ కు అమ్మినట్లు తెలుస్తోంది. ఇక మరికొందరికైతే అడ్వాన్స్ తీసుకోకుండా రైట్స్ ఇచ్చినట్లు సమాచారం. 

అయితే వారికీ AAA ఎంతవరకు నష్టాలను రికవర్ చేస్తుందో సినిమా రిలీజ్ అయ్యే వరకు నమ్మకం లేదు. ఫస్ట్ టాక్ బావుంటే తప్ప సినిమా కలెక్షన్స్ ఊపందుకునే అవకాశం లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో..