సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ లపై నటుడు సత్యరాజ్ ఊహించని విధంగా కామెంట్ చేశారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇద్దరి స్టార్ నటుల నిర్ణయాలపై చురకలంటించారు. తమిళనాడులో డీఎంకే అధినేతకు ప్రజలు అధికారాన్ని అందించడంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు. 

తమిళనాడులో రాజకీయ శూన్యత ఏర్పడిందని రాజకీయాల్లోకి వచ్చిన రాజినీకాంత్, కమల్ హాసన్ ల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. అదే విధంగా డీఎంకే వంటి పటిష్టమైన పార్టీని తప్పించాలనుకోవడం మూర్ఖత్వమే అంటూ.. జనాలు చాలా స్ఫష్టమైన ఫలితాన్ని ఇచ్చారని స్టార్స్ వల్ల ప్రయోజనం లేదని చురకలు అంటించారు. 

ఫైనల్ గా రాజకీయాలు చేయడానికి తమిళనాడులో చాలా మంది ఉన్నారని సైలెంట్ గా ఎవరి పని వారు చూసుకుంటే మంచిదని కౌంటర్ ఇచ్చారు. సత్యరాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మీడియాలో వైరల్ గా మారాయి. కట్టప్ప రాజకీయాలు మొదలుపెడుతున్నారని కోలీవుడ్ మీడియాలో కథనాలు కూడా వెలువడుతున్నాయి.