భారి బడ్జెట్ లతో సినిమాలు తీసే సంస్దలు వాటిని ప్యాన్ ఇండియా మూవీస్ గా తీర్చి దిద్దటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. దేశం మొత్తం రిలీజ్ చేస్తే బడ్జెట్ రికవరీ ఉంటుందనే ఆలోచన వారిని ఆ దిసగా ప్రేరేపిస్తోంది. అప్పుడు తమ సినిమాల్లో దాదాపు అన్ని భాషలకు చెందిన నటీనటులను తీసుకుంటున్నారు. అప్పుడు రిలీజ్ ఈజీ అవుతుంది. బిజినెస్ కూడా అన్ని భాషల్లో బాగుంటుంది. ఇప్పుడు అక్షయ్ కుమార్ కూడా తన తదుపరి చిత్రానికి అదే చేయబోతున్నారు.

వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రామ్ సేతు’. చంద్ర ప్రకాష్ ద్వివేది సమర్పణలో వస్తోన్న సినిమాకి అభిషేక్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, అబున్‌దంతియా ఎంటర్‌టైన్‌మెంట్‌, లైకా ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ నెలలో (మార్చి 18న) అయోధ్య రామ జన్మభూమిలో ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ మధ్యన సినిమాకి సంబంధించి అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ పోస్టర్ని చిత్రటీమ్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమాను పలు సౌతిండయన్ లాంగ్వేజ్ లలో కూడ రిలీజ్ చేయనున్నారు. అందుకే పలు ఇండస్ట్రీలకు చెందిన ముఖ్య నటులను సినిమాలోకి తీసుకుంటున్నారు. 

తమిళం నుండి సీనియర్ నటుడు నాజర్ ఈ సినిమాలో నటిస్తుండగా తెలుగు నుండి యువ నటుడు సత్యదేవ్ ఇందులో ఒక కీలక పాత్ర చేస్తున్నారు. ఇంత పెద్ద సినిమాలో అవకాసం కావడం సత్యదేవ్ కు దొరికిన మంచి అవకాశమని అనొచ్చు.  లాక్ డౌన్ ముగిసిన వెంటనే ఈ సినిమా షూటింగ్ రీస్టార్ట్ చేయనున్నారు అక్షయ్ కుమార్. ఇందులో పురావస్తు శాస్త్రవేత్తగా నటిస్తున్నారు అక్షయ్. సినిమాలో జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌, నుష్రాత్‌ భరుచ్ఛా ప్రధాన హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇది భారతదేశం - శ్రీలంకలను కలిపే ‘రామ సేతు’ వారధి నేపథ్యంలో భారతీయ సాస్కృతిక, చారిత్రక వారసత్వ మూలాల ఆధారంగా చిత్రం రూపొందుతోంది. అక్షయ్‌, ధనుష్‌, సారా అలీఖాన్‌ కలిసి నటించిన చిత్రం ‘అత్రాంగి రే’. ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది.