Asianet News TeluguAsianet News Telugu

‘గుర్తుందా శీతాకాలం’క్లోజింగ్ కలెక్షన్స్! ఇంత దారుణమా?

 సత్యదేవ్, స్టార్ హీరోయిన్ తమన్నా, మేఘా ఆకాష్, కావ్య శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘గుర్తుందా శీతాకాలం’.

Satya Dev Gurthunda Seethakalam closing Collections
Author
First Published Dec 18, 2022, 7:29 AM IST


 సత్యదేవ్ మంచి నటుడు, ఓటిటి స్టార్. మంచి క్రేజ్ ఉన్న నటుడు. మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్'లో విలన్‌గా, హిందీలో అక్షయ్ కుమార్ 'రామ్ సేతు'లో హనుమంతుడిగా... అక్టోబర్‌లో రెండు సినిమాలతో సందడి చేశారు. ఇప్పుడు డిసెంబర్‌లో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సత్యదేవ్ హీరోగా నటించిన చిత్రం 'గుర్తుందా శీతాకాలం' . ఇందులో ఆయన సరసన పాన్ ఇండియా స్టార్ తమన్నా భాటియా (Tamannaah Bhatia) హీరోగా నటించారు.  డిసెంబర్ 9న 'గుర్తుందా శీతాకాలం' చిత్రాన్ని విడుదల చేసారు. 

 ఈ  మూవీ షూటింగ్‌ ఎప్పుడో పూర్తయింది. ఈ సినిమా నుంచి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, టీజర్‌ కూడా చాలా కాలం కిందటే వచ్చాయి. అయితే రిలీజే వాయిదా పడుతూ వచ్చింది. కరోనా కారణంగా తొలుత వాయిదా పడింది. ఆ తర్వాత థియేటర్ల దగ్గరకు భారీ కమర్షియల్ సినిమాలు క్యూ కట్టడంతో వాయిదా వేయక తప్పలేదు. రెండు మూడు సార్లు విడుదల తేదీ వెల్లడించి మరీ వెనక్కి వెళ్లారు. ఇప్పుడు మంచి తేదీ చూసుకుని విడుదల చేసారు.  మూవీకి గుర్తుందా శీతాకాలం అనే వెరైటీ టైటిల్‌తోనే ప్రేక్షకులను ఆకర్షించారు ఈ సినిమా మేకర్స్‌. ఇక సత్యదేవ్‌, తమన్నాల కాంబినేషన్‌లో తొలిసారి ఓ మూవీ రానుండటం, ఇందులో ఈ ఇద్దరి కెమెస్ట్రీ మరో రేంజ్‌లో ఉండబోతుందని  ఎంతో ఊరించి రిలీజ్ చేసారు.  పూర్తి రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఇంతకాలం లేటు అవుతూ రావటంతో బజ్ క్రియేట్ కాలేదు. దానికి తగ్గట్లే సినిమాలో కంటెంట్ లేకపోవటంతో ఎవరూ పట్టించుకోలేదు.
 
తొలిరోజు ఈ చిత్రానికి ఓపినింగ్స్ ఫరవాలేదనిపించాయి ...కానీ రెండో రోజు నుండే థియేటర్లలో జనాలు ఖాళీ అయిపోయారు. ఈ క్రమంలో రిలీజైన 5 రోజులకే ఈ మూవీ ఫుల్ రన్ ముగిసినట్టు అయ్యింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం    0.15 cr
సీడెడ్    0.09 cr
ఏపీ    0.13 cr
ఏపీ + తెలంగాణ(టోటల్    0.37 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్    0.02 cr
వరల్డ్ వైడ్ టోటల్    0.39 cr

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రానికి రూ.1.72 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.కానీ ఈ మూవీ ఫుల్ రన్ ముగిసేసరికి కేవలం రూ.0.39 కోట్లు షేర్ ను మాత్రమే రాబట్టింది. అంటే బయ్యర్స్ రూ.1.61 కోట్లు నష్టపోయారన్న మాట. దీంతో ఈ మూవీ పెద్ద డిజాస్టర్ గా మిగిలిందని చెప్తున్నారు. అయితే సత్యదేవ్ కు ఓటిటిలో మంచి మార్కెట్ ఉంది కాబట్టి నిర్మాత అక్కడ ఎంతో కొంత రికవరీ ఉండే అవకాసం ఉందంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios