Asianet News TeluguAsianet News Telugu

సత్యదేవ్ వాయిస్ తో తమిళ హీరో సూర్య


మంచి డిక్షన్, తెలుగుపై మంచి కమాండ్ ఉన్న సత్యదేవ్ ని వెతుక్కుంటూ ఈ ఆఫర్ వచ్చింది. సూర్య తాజా చిత్రం ఆకాశమే నీ హద్దరా కోసం ఆయన్ని అడగటం జరిగింది. వెంటనే ఓకే చేసి డబ్బింగ్ పూర్తి చేసారట. సూర్య ఈ మధ్యకాలంలో తన సినిమాల తెలుగు వెర్షన్స్ కు డబ్బింగ్ తనే చెప్పుకున్నారు. అయితే బాగోలేదంటూ చాలా కామెంట్స్ వచ్చాయి. దాంతో ఈ నిర్ణయానికి దర్శక,నిర్మాతలు వచ్చినట్లు సమాచారం.

Satya Dev dubs for Tamil star Suriya
Author
Hyderabad, First Published Oct 2, 2020, 3:04 PM IST


వరస విజయాలతో సత్యదేవ్ తన కెరీర్ లో బెస్ట్ ఫేజ్ లో ఉన్నారు. బ్రోచేవారెవరురా, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాల విజయంతో ఆయన పట్టిందల్లా బంగారం అనే నిర్ణయానికి ఇండస్ట్రీ వచ్చింది. తాజాగా మూడు సినిమాలు సైన్ చేసారు. ఇక తాజాగా ఆయన తమిళ స్టార్ హీరో సూర్యకు డబ్బింగ్ చెప్పటానికి సిద్దమవుతున్నారు. 

మంచి డిక్షన్, తెలుగుపై మంచి కమాండ్ ఉన్న సత్యదేవ్ ని వెతుక్కుంటూ ఈ ఆఫర్ వచ్చింది. సూర్య తాజా చిత్రం ఆకాశమే నీ హద్దరా కోసం ఆయన్ని అడగటం జరిగింది. వెంటనే ఓకే చేసి డబ్బింగ్ పూర్తి చేసారట. సూర్య ఈ మధ్యకాలంలో తన సినిమాల తెలుగు వెర్షన్స్ కు డబ్బింగ్ తనే చెప్పుకున్నారు. అయితే బాగోలేదంటూ చాలా కామెంట్స్ వచ్చాయి. దాంతో ఈ నిర్ణయానికి దర్శక,నిర్మాతలు వచ్చినట్లు సమాచారం.

ఇక కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సూరారై పొట్రు'. 'గురు' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా   తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' అనే పేరుతో విడుదలకానుంది. అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సిఖ్య ఎంటెర్టైన్మెంట్స్ మరియు 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య నిర్మిస్తున్నాడు. సామాన్యుడికి సైతం విమాన సౌకర్యం అందించిన ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది.

Follow Us:
Download App:
  • android
  • ios