కోలివుడ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు ఇప్పుడు ఒక్కొక్కరుగా విడిపోతున్నారు. నటి అమలాపాల్ ప్రేమించి పెళ్లి చేసుకున్న దర్శకుడు ఏ.ఎల్.విజయ్ నుండి విడిపోయిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా హీరో విష్ణు విశాల్ ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యకు విడాకులు ఇచ్చేశాడు.

ఇప్పుడు హీరోయిన్ సాట్నా టైటస్ వంతు వచ్చినట్లుగా ఉంది. తెలుగులో 'బిచ్చగాడు' చిత్రంతో పరిచయమైన ఈ భామ హీరో విష్ణు నటించిన 'నీది నాది ఒకే కథ' సినిమాలో కూడా నటించింది. గతేడాది జనవరిలో పెద్దల్ని ఎదిరించి మరీ డిస్ట్రిబ్యూటర్ కార్తిని పెళ్లి చేసుకుంది సాట్నా.

వీళ్ల పెళ్లి సమయంలో చాలా హంగామానే నడిచింది. పోలీసులు, కేసులు అంటూ కోలివుడ్ లో వివాదాస్పదమయింది వీరి పెళ్లి. ఈ సంఘటనలు మర్చిపోక ముందే ఈ జంట ఇప్పుడు విడిపోవడానికి సిద్ధమయ్యారని టాక్.

ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో పెళ్లై రెండేళ్లు తిరగకుండానే విడివిడిగా ఉంటున్నారట. వీరి సన్నిహిత వర్గాల ద్వారా విషయం వెలుగులోకి వచ్చింది. వీరిద్దరూ ఎందుకు విడిపోయారనే విషయంపై స్పష్తం రాలేదు. ప్రస్తుతం సాట్నా ఓ తమిళ సినిమాలో నటిస్తోంది.