2017 సంక్రాంతికి శతమానం భవతి సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న. అయితే ఆ తరువాత నితిన్ తో చేసిన శ్రీనివాస కళ్యాణం మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. దీంతో సతీష్ ని దిల్ రాజు పక్కనపెట్టేశారు. శతమానం భవతి సమయంలో ఆఫర్స్ వచ్చినప్పటికీ వెయిటింగ్ లిస్ట్ లో పెట్టిన ఈ దర్శకుడికి ఇప్పుడు ఆఫర్స్ రావడమే కష్టంగా మారింది. 

అతనే ఇతర హీరోలు ఒప్పుకునే వరకు వెయిట్ చేయాల్సి వస్తోంది. ఆ రేంజ్ లో ప్లాప్ దెబ్బ పడింది. నెక్స్ట్ కళ్యాణ్ రామ్ తో ఒక సినిమాను సెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తొందరగా స్టార్ట్ చేసి హిట్ కొట్టాలని అనుకున్న సతీష్ కు కాస్త నిరాశ ఎదురైంది. ఎందుకంటే కళ్యాణ్ రామ్ సతీష్ ని హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం తుగ్లక్ సినిమాతో బిజీగా ఉన్న నందమూరి హీరో అక్టోబర్ వరకు డేట్స్ లేవని చెప్పేశాడట. అప్పటివరకు వెయిట్ చేయమని చెప్పినట్లు సమాచారం. మరో హీరో దగ్గరికి వెళ్లలేక సతీష్ వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని వెయిట్ చేయడానికి సిద్దమైనట్లు సమాచారం.