సర్కారు వారి పాట ట్రైలర్ వచ్చేసింది. దుమ్ము రేపేసింది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కుమ్మేసింది. క్లాస్ మాస్ మిక్స్ చేసి మహేష్ కుమ్మేశాడు.
నేడు సర్కారు వారి పాట ట్రైలర్ డే. మార్నింగ్ నుండి ఫ్యాన్స్ వేయికళ్లతో వేచి చూస్తున్నారు. వాళ్ళ ఎదురుచూపుల విలువకు మించి మహేష్ ట్రైలర్ లో ఇచ్చేశాడు. సర్కారు వారి పాట థియేటర్స్ లో పూనకాలే అని నిరూపించాడు. ట్రైలర్(Sarkaru Vaari Paata Trailer) ఆరంభమే మహేష్ క్యారెక్టర్ ఏమిటో తెలియజేసింది. ''మీరు నా ప్రేమను దొంగిలించగలరు, స్నేహాన్ని దొంగిలించగలరు, కానీ నా డబ్బును దొంగించలేరు'' అని మహేష్ చెప్పడం ఆయన ఎంత మనీ మైండెడో తెలియజేస్తుంది. అదే సమయంలో రూపాయికి విలువిచ్చే మనిషిగా కనిపిస్తున్నాడు. మహేష్ లోని ఈ నేచర్ వెనుక కారణం ఏమిటనేది అసలు కథ.
ట్రైలర్ ద్వారా మహేష్(Mahesh babu) లోని మాస్, క్లాస్ యాంగిల్స్ పరిచయం చేశారు. కీర్తి సురేష్ తో ఆయన రొమాన్స్, కెమిస్ట్రీ క్లాస్ ఆడియన్స్ కి ఫీస్ట్ అయితే, మాస్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ కలిగించే యాక్షన్, డైలాగ్స్ పుష్కలంగా ఉన్నాయి. ట్రైలర్ లో మహేష్ చెప్పిన కొన్ని డైలాగ్స్ చూస్తుంటే ఆయన క్యారెక్టర్ చాలా రఫ్ గా ఉంటుందని అర్థమవుతుంది. రెండున్నర నిమిషాల ట్రైలర్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పంచింది.
మహేష్ సర్కారు వారి పాట చిత్రంతో ఓ భారీ కమర్షియల్ హిట్ ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. అలాగే కీర్తి సురేష్(keerthy Suresh) గ్లామర్ కూడా హైలెట్ గా ఉంది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ముచ్చటగా ఉండే అవకాశం కలదు. ఇక ట్రైలర్ లో సముద్ర ఖని, వెన్నెల కిషోర్, సుబ్బరాజ్ కనిపించారు. సముద్ర ఖని మెయిన్ విలన్ రోల్ చేస్తున్నట్లు సమాచారం.
కాగా మే 12న సర్కారు వారి పాట వరల్డ్ వైడ్ గా విడుదలవుతున్న విషయం తెలిసిందే. థమన్ సంగీతం అందిస్తుండగా సాంగ్స్ ఆదరణ దక్కించుకున్నాయి.
