సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ వసూళ్లు నిన్నటి నుంచి మొదలయ్యాయి. తాజాగా తొలి రోజు కలెక్షన్లను చిత్ర యూనిట్ అన్సౌన్స్ చేసింది. అయితే అవన్నీ ఫేక్ కలెక్షన్లు అంటూ ట్వీటర్ లో ట్రోల్స్ జరగడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
దర్శకుడు పరుశురాం పెట్ల, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata). దాదాపు రెండేండ్ల తర్వాత మహేశ్ బాబు ఈ చిత్రంతో థియేటర్లలో అడుగుపెట్టాడు. మే 12 (నిన్న) సర్కారు వారి పాట గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అయితే ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ చెప్పినంతగా సినిమా ఆకట్టుకోలేదని పలువురు విమర్శకులు తెలుపుతున్నారు. మిశ్రమ స్పందనను సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్ల వివరాలపైనా పలు ఆరోపణలు వస్తున్నాయి.
తాజాగా మేకర్స్ తొలిరోజు కలెక్షన్ల వివరాలను వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు రూ.75 కోట్ల గ్రాస్ ను రాబట్టింది అధికారికంగా ప్రకటించారు. ఆల్ టైమ్ రీజినల్ ఫిల్మ్ రికార్డుగా అన్సౌన్స్ చేశారు. మరోవైపు ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం యూఎస్ బాక్సాఫీసు వద్ద 1 మిలియన్ గ్రాస్ వసూళ్లను సాధించినట్టు యూనిట్ ప్రకటించింది. అవే నివేదిక ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ‘సర్కారు వారి పాట’ కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి.
నైజాలో రూ.12.24 కోట్లు, సీడెడ్ లో రూ.4.7 కోట్లు, యూఏ ఏరియా రూ.3.73 కోట్లు, ఈస్ట్ లో రూ. 3.25 కోట్లు, వెస్ట్ లో రూ.3 కోట్లు, గుంటూరు ఏరియాలో రూ.5.83 కోట్లు, క్రిష్ణలో రూ.2.58 కోట్లు, నెల్లూరులో రూ.1.56 కోట్ల కలెక్షన్లతో మొత్తం రూ. 36.89 కోట్టు షేర్ ను వసూల్ చేసింది.
ఇదిలా ఉంటే.. చిత్రయూనిట్ ప్రకటిస్తున్న వివరాలు, ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న వివరాలను తప్పుబడుతున్నారు ట్రోలర్స్. అవన్నీ ఫేక్ కలెక్షన్స్ అంటూ ఆరోపిస్తున్నారు. నిజాం జిల్లాల్లో ఒక్క ATR కూడా లేదని, అయినా ఇప్పటికే NON RRR రికార్డు అంటూ ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఆంధ్రలో కేవలం రూ.20 కోట్ల నుంచి రూ.21 కోట్ల మధ్యే అయినా రూ.23 కోట్లుగా ప్రచారం చేయడం సరికాదన్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ లేనివిధంగా ఇలాంటి సంఘనలు వెలుగుచూస్తున్నాయని పోస్టులు పెడుతున్నారు. దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరీ.
బ్యాకింక్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేశ్ బాబు, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందివ్వగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. శాటిలైట్ హక్కులను స్టార్ మా దక్కించుకుంది. చిత్రంలో వెన్నెల కిశోర్, విలన్ పాత్రలో సముద్రఖని నటించారు.
