Asianet News TeluguAsianet News Telugu

SVP : రెండో రోజు కలెక్షన్స్..నెగిటివ్ టాక్ ప్రభావం ఎంత?!

 'సర్కారు వారి పాట' రెండో రోజు ఏరియా వైజ్ వసూళ్ళు క్రింది విధంగా ఉన్నాయి. మరి ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే నాటికి ఎలాంటి వసూళ్ళు రాబడుతుందో చూడాలి.

Sarkaru Vaari Paata box office collections day 2
Author
Hyderabad, First Published May 14, 2022, 12:22 PM IST

మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ రెండు రోజుల క్రితం గురువారం రోజు (మే 12) మొదలైంది. ఎంటర్టైన్మెంట్ కు పెద్ద పీట వేసిన ఈ సినిమాకు మిక్సెడ్ టాక్ వచ్చింది. రివ్యూలన్నీ తేడాగానే ఉన్నాయి.అయితే ఆడవాళ్లకు ఈ సినిమా బాగా నచ్చుతోందని ట్రేడ్ అంటోంది. ఈ నేపధ్యంగా నెగిటివ్ టాక్ ని తట్టుకుని ఈ సినిమా నిలబడిందా లేక కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయా అనేది హాట్ టాపిక్ గా మారింది.  

అందుతున్న సమాచారం మేరకు రెండో రోజు శుక్రవారం  మార్నింగ్ - మ్యాట్నీ షోలకు డ్రాప్స్ కనిపించాయి. మళ్ళీ ఈవెనింగ్ - నౌట్ షోలకు మాత్రం హౌస్ ఫుల్స్ బోర్డ్ లు చూపించింది.ఈ నేపథ్యంలో సర్కారు వారి పాట సినిమా రెండో రోజు ఆంధ్రప్రదేశ్ & తెలంగాణా రాష్ట్రాలు కలుపుకొని 11.64 కోట్ల షేర్ అందుకున్నట్లు మేకర్స్ వెల్లడించారు.  మొదటి రోజే డివైడ్ టాక్  తెచ్చుకున్నా.. వర్కింగ్ డే నాడు ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే సాలిడ్ గా ఉందనే అనుకోవాలి.

 'సర్కారు వారి పాట' రెండో రోజు ఏరియా వైజ్ వసూళ్ళు క్రింది విధంగా ఉన్నాయి. మరి ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే నాటికి ఎలాంటి వసూళ్ళు రాబడుతుందో చూడాలి.

నైజాం - 5.2 కోట్లు

సీడెడ్ - 1.45 కోట్లు

యూఏ - 1.65 కోట్లు

ఈస్ట్ - 1.08 కోట్లు

వెస్ట్ - 45 లక్షలు

గుంటూరు - 51 లక్షలు

కృష్ణ - 89 లక్షలు

నెల్లూరు - 41 కోట్లు

మొత్తం - 11.64 కోట్లు

'సర్కారు వారి పాట' నిర్మాతల లెక్కల ప్రకారం ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో 48.53 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది.    ‘దూకుడు’ సినిమాలో హీరో, హీరోయిన్, వెన్నెల కిషోర్  మధ్య విదేశాల్లో తీసిన రొమాంటిక్ ట్రాక్ ఎలా మెప్పించిందో అలా ఇందులోనూ అమెరికాలో సాగే సీన్లు ఆకట్టుకుంటున్నాయి. మిక్సెడ్ టాక్ తెచ్చుకున్నా ఎంటర్టైన్మెంట్ ఎక్కువగానే ఉండటం కలిసొచ్చే అంశం.

 సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు రెండేళ్ల త‌ర్వాత స‌ర్కారు వారి పాట చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టించ‌గా, ప‌ర‌శురాం తెర‌కెక్కించారు. ఈ మూవీ గురువారం ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకొంది. 
 
ఇక వీకెండ్స్ పూర్తయ్యే సరికి ఎలాంటి నంబర్స్ నమోదు చేస్తుందో లాంగ్ రన్ లో ఎక్కడ ఆగుతుందో లెక్కలు వేస్తోంది ట్రేడ్. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందివ్వగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. శాటిలైట్ హక్కులను స్టార్ మా దక్కించుకుంది.

Follow Us:
Download App:
  • android
  • ios