డైరెక్టర్ గా రాఘవేంద్ర రావు ఎందరో నటుల్ని చిత్ర పరిశ్రమకు పరిచయం చేయడమే కాదు స్టార్స్ గా నిలబెట్టారు. ఇప్పుడు డైరెక్టర్ గా రాఘవేంద్ర రావు సినిమాలు బాగా తగ్గించారు. నిర్మాతగా మారారు. ఆయన నిర్మాణంలో త్వరలో రాబోతున్న చిత్రం సర్కారు నౌకరి.

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ప్రస్తుతం సినిమాలు నిర్మిస్తూ నూతన నటీనటులకు అవకాశాలు కల్పిస్తున్నారు. కొత్త నటీనటుల ట్యాలెంట్ ని వెండితెరకు పరిచయం చేసే పనిలో ఉన్నారు. డైరెక్టర్ గా రాఘవేంద్ర రావు ఎందరో నటుల్ని చిత్ర పరిశ్రమకు పరిచయం చేయడమే కాదు స్టార్స్ గా నిలబెట్టారు. 

ఇప్పుడు డైరెక్టర్ గా రాఘవేంద్ర రావు సినిమాలు బాగా తగ్గించారు. నిర్మాతగా మారారు. ఆయన నిర్మాణంలో త్వరలో రాబోతున్న చిత్రం సర్కారు నౌకరి. గంగనమోని శేఖర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సింగర్ సునీత కుమారుడు ఆకాష్ కి జోడిగా భావన నటిస్తోంది. ఆర్కే టెలీ షో ప్రై లిమిటెడ్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

శనివారం రోజు ఈ చిత్ర మీడియా సమావేశం నిర్వహించారు. చిన్న ఈవెంట్ లా జరిగిన ఈ కార్యక్రమానికి సర్కారు నౌకరి చిత్ర బృందంతో పాటు రాఘవేంద్ర రావు అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో సర్కారు నౌకరి చిత్ర టీజర్ లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ లో హీరోయిన్ భావన మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె చెప్పాలనుకున్న విషయం వేరైనప్పటికీ కామెంట్స్ మాత్రం డబుల్ మీనింగ్ గా ఉండడంతో అంతా షాక్ అవుతున్నారు. 

YouTube video player

ప్రయివేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ మానేసి థియేటర్ ఆర్టిస్ట్ గా చేరా. అయితే సినిమా అవకాశాలు వస్తాయనే నమ్మకం నాకు లేదు. కానీ నేను ఊహించని విధంగా ఈ చిత్రంలో ఛాన్స్ వచ్చింది. రాఘవేంద్ర రావు గారికి ఇంకా మోజు తీరలేదు.. కాబట్టి మాలాంటి యంగ్ ట్యాలెంట్ ని ప్రోత్సహిస్తున్నారు. ఆయన మోజు తీరలేదు కాబట్టే మా మోజు తీరుతోంది అంటూ భావన ఫన్నీగా కామెంట్స్ చేసింది. 

దీనితో అక్కడున్న రాఘవేంద్ర రావు పడీపడీ నవ్వుకున్నారు. నెటిజన్లు అయితే ఆమె ఏం మాట్లాడుతోందో అర్థం అవుతోందా.. నరాలు కట్ అయిపోతున్నాయి అని కామెంట్స్ చేస్తున్నారు.