సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ లుక్ ఆకట్టుకుంటోంది. 

ఇక స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ టైటిల్ సాంగ్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల ఈ చిత్రంలోని కీలకమైన ట్రైన్ ఎపిసోడ్ ని చిత్రీకరించారు. ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నవారంతా ఈ సన్నివేశం షూటింగ్ లో పాల్గొన్నారు. 

చాలా రోజుల తర్వాత నిర్మాత బండ్ల గణేష్ నటుడిగా ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గణేష్ పాత్ర ఈ చిత్రంలో చాలా ఫన్నీగా ఉంటుందట. కాగా ట్రైన్ ఏపీ[ఎపిసోడ్ చిత్రీకరణ పూర్తయిన తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడితో నటీనటులు సెల్ఫీ తీసుకున్నారు. ఇందులో మహేష్ బాబు లేడు. 

హీరోయిన్ రష్మిక, సీనియర్ హీరోయిన్ సంగీత, బండ్ల గణేష్, నటి హరితేజ కనిపిస్తున్నారు. బండ్ల గణేష్ తలకు ఎర్రటి బ్యాండ్ ధరించి కనిపిస్తున్నాడు. సెటప్ మొత్తం చూస్తుంటే దర్శకుడు అనిల్ రావిపూడి కడుపుబ్బా నవ్వించే సన్నివేశాన్ని డిజైన్ చేసినట్లు ఉంది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

From the sets of Sarileru Neekevaru..😊😎 @anilravipudi @rashmika_mandanna @bandlaganesh_offl 😃😃😃😃

A post shared by hariteja (@actress_hariteja) on Aug 15, 2019 at 2:18am PDT