2019లో విడుదలైన "ఖైదీ" సినిమా తర్వాత కార్తీ "సుల్తాన్" వంటి కొన్ని సినిమాలలో నటించారు. కానీ అది బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించలేకపోయాయి. తాజాగా ఇప్పుడు కార్తీ "సర్దార్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. 

కార్తికి తెలుగులో ప్రత్యేకమైన మార్కెట్ ఉంది. అతని తొలి సినిమా నుంచి దాదాపు ప్రతీ సినిమా ఇక్కడ డబ్బింగ్ అవుతూనే వస్తోంది. ముఖ్యంగా ఖైదీ తెలుగులో ఘన విజయం సాధించింది. తాజాగా కార్తీ లేటెస్ట్ స్పై థ్రిల్లర్ ‘సర్దార్’ దీపావళి కానుకగా శుక్రవారం థియేటర్లలో విడుదల అయింది. అంతకు ఇరవై రోజుల క్రితమే ‘పొన్నియిన్ సెల్వన్: 1’తో హిస్టారికల్ బ్లాక్‌బస్టర్ అందుకున్న కార్తీ ఈసారి స్పై థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ సినిమా ట్రైలర్ బాగుండటంతో ప్రేక్షకులకు ఎక్సపెక్టేషన్స్ బాగా పెరిగిపోయాయి. అందుకు తగ్గట్లే హిట్ టాక్ వచ్చింది. తమిళంలో ‘విరుమన్’, ‘పొన్నియిన్ సెల్వన్: 1’లతో హిట్ కొట్టిన కార్తీ ‘సర్దార్’ కూడా హిట్ అయితే హ్యాట్రిక్ కొట్టాడు. ‘అభిమన్యుడు’ లాంటి సూపర్ సైబర్ థ్రిల్లర్‌ను అందించిన పీఎస్ మిత్రన్ ఈ సినిమాకు దర్శకత్వం అందించటం మరో ప్లస్ అయ్యింది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో కింగ్ అక్కినేని నాగార్జున తన ‘అన్నపూర్ణ స్టూడియోస్’ ద్వారా విడుదల చేశారు. ఇక ఈ చిత్రం కలెక్షన్స్ ఏరియా వైజ్ చూద్దాం.

దీపావళి పోటీలో మొదటి రోజు ఈ చిత్రం జస్ట్ ఓకే, పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది.సినిమా చూసిన ప్రతి ఒక్కరూ టాక్ బాగుందనే చెప్పారు. దీంతో మొదటి రోజు డీసెంట్ కలెక్షన్స్ ను రాబట్టింది.మొదటి రోజును మించి రెండో రోజు, రెండో రోజుని మించి మూడో రోజు అలా మొదటి వారం ఈ మూవీ బాగా కలెక్ట్ చేసి ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయ్యింది. 

 ‘సర్దార్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 2.60 cr
సీడెడ్ 0.75 cr
ఉత్తరాంధ్ర 0.94 cr
ఈస్ట్+వెస్ట్ 0.58 cr
కృష్ణా + గుంటూరు 0.79 cr
నెల్లూరు 0.36 cr
ఏపి+ తెలంగాణ 6.02 cr

‘సర్దార్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.4.59 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.4.9 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.5 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ మొదటి వారం పూర్తయ్యేసరికి రూ.6.02 కోట్ల షేర్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించింది. పోటీలో ఉన్న పోటీగా ‘ప్రిన్స్’ ‘ఓరి దేవుడా’ ‘జిన్నా’ వంటి చిత్రాలు పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. కార్తి చిత్రాల్లో ‘ఖైదీ’ రూ.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. ఇప్పుడు ఈ చిత్రం ఆ సినిమాని దాటుతుందా అనే విషయం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.