బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీఖాన్ త్వరలోనే 'కేథార్ నాథ్' సినిమాతో హీరోయిన్ గా పరిచయం కానుంది. అయితే ఇటీవల ఓ షోలో ఆమె రణబీర్ కపూర్ ని పెళ్లి చేసుకోవాలనుందని చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి.

అసలు విషయంలోకి వస్తే.. కాఫీ విత్ కరణ్ షోలో సారా ఆలీఖాన్ తన తండ్రి సైఫ్ అలీఖాన్ తో కలిసి హాజరైంది. దీనికి సంబంధించిన ప్రోమో బయటకొచ్చింది. ఈ షోలో భాగంగా కరణ్ అడిగిన కొన్ని వ్యక్తిగత విషయాలకు సారా అలీఖాన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకి రణబీర్ కపూర్ ని పెళ్లి చేసుకోవాలనుందని సారా వెల్లడించడం విశేషం.

ఆమె సమాధానానికి హోస్ట్ కరణ్ తో పాటు సారా తండ్రి సైఫ్ కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే రణబీర్ కపూర్.. సారా సవతి తల్లి కరీనా కపూర్ కి సోదరుడు. ఈ కారణంగానే ఇప్పుడు ఈ వార్త వైరల్ అయింది. మరి ఈ విషయం తెలిస్తే రణబీర్ గర్ల్ ఫ్రెండ్ అలియా భట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి!