త్వరలో పట్టాలెక్కనున్న మణిరత్నం, రామ్ చరణ్ ల మూవీ మణిరత్నం, చరణ్ ల మూవీ హీరోయిన్ గా బాలీవుడ్ హీరో సైఫ్ కూతురు చరణ్ సరసన సైఫ్ కుమార్తె సారా ఆలీ ఖాన్ ను ఎంపిక చేసిన మణిరత్నం
కొణిదెల ప్రొడక్షన్స్ అధినేత, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తదుపరి సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందోనని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ సినిమాపై ఓ క్లారిటీ రావడమే కాదు.. హీరోయిన్ కూడా దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.
రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ క్రియేటివ్ దర్శకుడు మణిరత్నంతో చేయబోతున్నాడు. మణిరత్నం డైరెక్షన్ లో రామ్ చరణ్ ఓ మూవీ చేయబోతున్నాడని చాలాకాలంగా వినిపిస్తోంది. అయితే అది ఇప్పుడు పట్టాలెక్కుతున్నట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ సరసన మణిరత్నం సినిమాలో.. ఐశ్వర్యారాయ్ టాలీవుడ్ రీఎంట్రీ ఉండబోతుందని కూడా ఊహాగానాలు వినిపించాయి.
అయితే ఐశ్వర్యా రాయ్ ప్లేస్ లో కొత్త తార నటించబోతున్నట్టు సమాచారం. బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీఖాన్ కూతురు సారా ఆలీ ఖాన్ ను మణిరత్నం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. మణిరత్నం సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకోవడం అంత ఆషామాషీ కాదు. ఆ ఛాన్స్ కోసం ఎంతోమంది తారలు ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు ఆ ఛాన్స్ సారా ఆలీఖాన్ దక్కించుకోబోతోంది.
