విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం థియేటర్స్ లో 300 కోట్ల వసూళ్లు రాబట్టి ప్రభంజనం సృష్టించింది. ఈ చిత్రం అడుగుపెట్టిన ప్రతి చోటా సంచలనం సృష్టిస్తోంది.
విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం థియేటర్స్ లో 300 కోట్ల వసూళ్లు రాబట్టి ప్రభంజనం సృష్టించింది. ఈ చిత్రం అడుగుపెట్టిన ప్రతి చోటా సంచలనం సృష్టిస్తోంది. సంక్రాంతికి తీవ్రమైన పోటీలో విడుదలైన ఈ చిత్రం గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ లాంటి మాస్ చిత్రాలని అధికమించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
సంక్రాంతికి వస్తున్నాం దెబ్బకి పాన్ ఇండియా చిత్రాల రికార్డులు బ్రేక్
శనివారం రోజు ఈ చిత్రాన్ని జీ తెలుగు ఛానల్, జీ5 ఓటిటిలో తొలిసారి ప్రీమియర్ ప్రదర్శించారు. అంతా ఊహించినట్లుగానే ఈ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రానికి బుల్లితెర ప్రేక్షకుల నుంచి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చింది. జీ5 ఓటిటిలో అయితే ఈ చిత్రం దెబ్బకు రికార్డులు గల్లంతవుతున్నాయి. జీ5లో ఈ చిత్రం కేవలం 12 గంటల్లోనే ఆర్ఆర్ఆర్, హను మాన్ లాంటి పాన్ ఇండియా చిత్రాల రికార్డులు బ్రేక్ చేసింది.
12 గంటల్లో ఈ చిత్రానికి 100 మిలియన్ల పైగా స్ట్రీమింగ్ మినిట్స్ నమోదయ్యాయి. అదే విధంగా 13 లక్షల మంది ఈ చిత్రాన్ని వీక్షించారు. ఫ్యామిలీ ఆడియన్స్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. వెంకటేష్ కామెడీ టైమింగ్, హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ల గ్లామర్, బుల్లిరాజు హంగామా, భీమ్స్ సంగీతం ఈ అంశాలన్నీ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని నెక్స్ట్ లెవల్ కి తీసుకువెళ్లాయి.
అన్ని భాషల్లో ఓటీటీలో సంక్రాంతికి వస్తున్నాం
డైరెక్టర్ అనిల్ రావిపూడి చేసిన మ్యాజిక్ ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ చిత్రం వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఓటిటిలో ఈ చిత్రాన్ని తమిళ, కన్నడ , హిందీ, మలయాళీ భాషల్లో కూడా రిలీజ్ చేశారు. దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు.
అనిల్ రావిపూడి ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా ఈ చిత్రంతో వరుసగా 8వ సూపర్ హిట్ అందుకున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా విడుదలైన ఈ చిత్రం ఏకంగా 300 కోట్లు వసూళ్లు రాబట్టడంతో ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోయింది.
