కేజీఎఫ్ ప్రభంజనం అంతా ఇంతా కాదు. దాదాపు తెలుగులో ఓ డబ్బింగ్‌ సినిమా 50 కోట్లకు పైగా వసూలు చేయడం  సాధారణ విషయం కాదు. ఆ చిత్ర హీరో యశ్‌తో పాటు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌పై ప్రశంసల జల్లులు కురిశాయి. ఇప్పుడు అందరి దృష్టి కేజీఎఫ్‌ మోడల్ పై పడింది. అదే మోడల్ లో బోయపాటి తన తదుపరి సినిమాని ఆవిష్కరించబోతున్నట్లు చెప్తున్నారు. అందులో భాగంగా మొదట విలన్ గా సంజయ్ దత్ ని ఎంపిక చేసారని అంటున్నారు. వరల్డ్ క్లాస్ విజువల్స్, లోకల్ కథ ఈ సినిమాకు హైలెట్ అంటున్నారు.

సంజయ్ దత్ మంచి నటుడు అనే సంగతి తెలిసిందే. ఆయనతో సినిమా చేస్తే వచ్చే క్రేజే వేరు. బాలీవుడ్ లోనూ బిజినెస్ ఉంటుంది. ఇప్పుడు ఆయన కన్నడ నటుడు యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న కేజీఎఫ్ 2లో బాలీవుడ్ నటుడు సంజయ్‌ దత్ విలన్ గా   కనిపించబోతున్నారు. అదే క్రేజ్ తో ఇప్పుడు మన తెలుగు సినిమాలోనూ విలన్ గా కనిపించటానికి రంగం సిద్దమైందని తెలుస్తోంది.ఆ సినిమా మరోదో కాదు బాలయ్యది ని తెలుస్తోంది.  బాలకృష్ణ, బోయపాటి కలయికలో రూపొందుతున్న మూడో చిత్రం విషయంలో కూడా సంజయ్ దత్ నే విలన్ గా తీసుకోవటం జరుగుతోంది.

సాధారణంగానే బోయపాటి సినిమాలలో యాక్షన్ పాలు కాస్త ఎక్కువ వుంటుంది. దానికి తోడు విలనిజం కూడా కొత్త తరహాలో సాగుతుంది. అందుకే, ఆయా విలన్ల పాత్రలకు ఆయన సమ ఉజ్జీల లాంటి నటులను ఎంపిక చేస్తుంటారు. ఇప్పుడీ చిత్రంలో ఇద్దరు విలన్లు ఉండడంతో ఓ పాత్రకు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో సంజయ్ తో మాట్లాడడం కూడా జరిగిందనీ, ఆయన సానుకూలంగా స్పందించాడనీ అంటున్నారు.  

లెజెండ్ సినిమాతో జగపతిబాబును విలన్ గా పరిచయం చేశాడు బోయపాటి.  ఈ సినిమా తరువాత జగపతిబాబు విలన్ గా పాపులర్ అయ్యాడు.  కాల్ షీట్ ఖాళీ లేనంతగా బిజీ అయ్యాడు జగపతిబాబు.  ఇప్పుడు బాలయ్య సినిమాలో సంజయ్ దత్ ను విలన్ గా తీసుకుంటున్నారు కాబట్టి ఈ సినిమాతో   తెలుగులో సంజయ్ దత్ కూడా బిజీ అవుతారని అనుకోవచ్చు.