టాలీవుడ్ దర్శకుల్లో ఓ వర్గం దర్శకులకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా ప్రతిసారి జనాల్ని ఆకర్షించే వారు కొందరుంటారు. అలాంటి దర్శకుల్లో దేవాకట్టా ఒకరు. ప్రస్థానం సినిమాతో ఒక్కసారిగా ఇండియన్ సినిమాను ఆకర్షించాడు. 

ఇప్పుడు బాలీవుడ్ లో కూడా మరో ప్రస్థానాన్ని తెరకెక్కిస్తున్నాడు. తెలుగులో సాయి కుమార్ చేసిన పాత్రలో సంజయ్ దత్ నటిస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ కూడా నెటిజన్స్ ని ఆకట్టుకుంటోంది. సంజయ్ సొంత ప్రొడక్షన్ లోనే ప్రస్థానం సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా మేకింగ్ కి ఫిదా అయిన సంజయ్ దేవకట్టకు మరో అఫర్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదు చేస్తుందని చిత్ర యూనిట్ లో ప్రతి ఒక్కరు చెబుతున్నారు. ఈ టాక్ బాలీవుడ్ లో వైరల్ గా మారింది. ఇతర ప్రొడక్షన్ హౌజ్ ల నుంచి కూడా దేవకట్టకు ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. ప్రస్థానం తెలుగులో కమర్షియల్ గా అంతగా సక్సెస్ కాలేదు. మరి బాలీవుడ్ లో ఏ విధంగా విజయాన్ని అందుకుంటుందో చూడాలి.