డబల్ ఇస్మార్ట్ నుండి సంజయ్ దత్ ఫస్ట్ లుక్!
డబల్ ఇస్మార్ట్ మూవీలో సంజయ్ దత్ విలన్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. నేడు సంజయ్ దత్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

దర్శకుడు పూరి జగన్నాథ్-ఛార్మి కౌర్ నిర్మాణ భాగస్వాములుగా అరడజను సినిమాలకు పైగా చేశారు. వాటిలో హిట్టైంది మాత్రం ఒకటే. అదే ఇస్మార్ట్ శంకర్. రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్. 2019లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ వరల్డ్ వైడ్ రూ. 75 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా మేకింగ్ కి ఉన్నవన్నీ అమ్మి పెట్టారు పూరి, ఛార్మి. లక్ కలిసొచ్చి హిట్ పడింది. ఈ సినిమా హాలీవుడ్ మూవీ ఐబాయ్ కి కాపీ అనే విమర్శలు వినిపించాయి. పూరి కూడా ఇస్మార్ట్ శంకర్ హాలీవుడ్ మూవీ ఇన్సిపిరేషన్ అని ఒప్పుకున్నారు.
ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన జోష్ తో లైగర్ మూవీ ప్రకటించారు. పాన్ ఇండియా లెవెల్ లో భారీగా ప్లాన్ చేశారు. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా లైగర్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కథ మళ్ళి మొదటికి వచ్చింది. పూరి జగన్నాధ్ కి ఏ హీరో ఆఫర్ ఇచ్చే పరిస్థితి లేదు. తనకు ఇస్మార్ట్ శంకర్ వంటి హిట్ ఇచ్చిన దర్శకుడు పూరిని రామ్ పోతినేని ఆదుకున్నాడు. వీరి కాంబోలో డబల్ ఇస్మార్ట్ టైటిల్ తో ప్రాజెక్ట్ ప్రకటించారు. ఈ మూవీకి కూడా పూరి, ఛార్మి నిర్మాతలుగా ఉన్నారు.
ఇటీవల డబల్ ఇస్మార్ట్ మూవీ షూటింగ్ మొదలైంది. ఈ మూవీలో విలన్ గా సంజయ్ దత్ నటిస్తున్నారు. ఆయన క్యారెక్టర్ పేరు బిగ్ బుల్. నేడు సంజయ్ దత్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. సూట్ ధరించి, సిగార్ తాగుతూ మాఫియా డాన్ గెటప్ లో సంజయ్ దత్ ఆకట్టుకున్నారు. ఆయన లుక్ చాలా ఫెరోషియస్ గా ఉంది.
లేటెస్ట్ అప్డేట్ డబల్ ఇస్మార్ట్ మూవీపై అంచనాలు పెంచేసింది. డబల్ ఇస్మార్ట్ మూవీ 2024 మార్చి 8న విడుదల కానుంది. ఈ మూవీ పూరి జగన్నాధ్ కి చావో రేవో తేల్చే చిత్రం. పూరి పరిశ్రమలో ఉండాలంటే డబల్ ఇస్మార్ట్ తో హిట్ కొట్టాల్సిందే. మరి ఆయన లుక్ ఎలా ఉందో చూడాలి.