సెలెబ్రిటీలు సోషల్ మీడియాలోకి అందుబాటులోకి వస్తే చాలు. నెటిజెన్స్ ప్రశ్నల బాణాలు సిద్ధం చేసుకుంటారు. సదరు సెలెబ్రిటీని తమ ప్రశ్నలతో ఎలా ఇరుకున పెట్టాలనే ప్రయత్నం చేస్తారు. సోషల్ మీడియా ఛాట్ లో పాల్గొనే ప్రతి సెలబ్రిటీ, కొందరు నెటిజెన్స్ నుండి దారుణమైన ప్రశ్నలను ఎదుర్కొంటు ఉంటారు. తాజాగా నటుడు సంజయ్ దత్ కూతురు త్రిశాలా దత్ కి ఇలాంటి అనుభవమే ఎదురైంది. 


సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో చిట్ ఛాట్ చేస్తున్న  త్రిశాలా దత్ ని ఓ నెటిజన్.. మీ బాయ్ ఫ్రెండ్ ఎలా చనిపోయాడు, అతని పేరేంది? అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నను వదిలి వేయకుండా సుదీర్ఘ సమాధానం చెప్పింది త్రిశాలా. నా సమాధానం మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడితే నన్ను క్షమించాలి అన్నారు. నేను ఈ సమాధానం ద్వారా కొందరిని ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నా అన్నారు. 


మనకు అసలు ఎటువంటి సంబంధం లేకపోయినా ఓ వ్యక్తి మరణించాడంటే అతడు ఎలా చనిపోయాడో తెలుసుకోవాలని అంటుకుంటాం.. అది మనిషి స్వభావం. ఒక మనిషి ఎలా చనిపోయాడని తెలుసుకోవడం అర్థం లేని స్పందన. నిన్ను నేను ఓ ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను.. అతని చావు గురించి నన్ను అడగవడం వలన నీకు ఉపయోగం ఏముంది? అని సదరు నెటిజెన్ ని త్రిషాలా అడిగారు. ఎవరో ఆకతాయి అడిగిన ప్రశ్నకు త్రిశాలా దత్ సుదీర్ఘ వివరణ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.