#Bhairavakona:మిగతావాళ్లంతా నో చెప్తే 'భైరవకోన' నిర్మాతే ఓకే అన్నాడు
ముందు ఈ విషయం ఛాంబర్ నోటీస్ కి రాలేదు వచ్చిన వెంటనే ఏ కే ఎంటర్టైన్మెంట్స్ వాళ్లు అనిల్ సుంకర, రాజేష్ తో..
ఈ ఏడాది సంక్రాంతికి పెద్ద వారే భాక్సాఫీస్ దగ్గర జరిగింది. వరుసగా నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ క్రమంలో సంక్రాంతి బరిలో ఉండాల్సిన రవితేజ ఈగల్ మూవీ మాత్రం ఫిలిం ఛాంబర్ విజ్ఞప్తి మేరకు పీపుల్స్ మీడియా ప్రొడ్యూసర్స్ సినిమాని వాయిదా వేశారు. అయితే, ఫిలిం ఛాంబర్ సమావేశంలో..ఈగల్ ప్రొడ్యూసర్స్ కు సోలో రిలీజ్ డేట్ ఇస్తామని..ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని ఛాంబర్ అధ్యకుడు దిల్ రాజ్ సైతం మాట ఇచ్చారు. అయితే అదే తేదీకి భైరవకోన, యాత్ర 2, లాల్ సలాం చిత్రాలు వస్తున్నాయి. వారందరితో మీటింగ్ పెట్టారు. ఈ క్రమంలో భైరవకోన నిర్మాతలను వాయిదాకు ఒప్పించారు. సంక్రాంతి సమయంలో సోలో రిలీజ్ మాట ఇచ్చినప్పుడు భైరవకోన నిర్మాతలని అడగలేదని , దాంతో వాళ్లు ఫోస్ట్ పోన్ కు వెళ్లరని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా భైరవకోన నిర్మాతను ఒప్పించారు. ఆ తర్వాత రవితేజ ఈగల్ మూవీ సోలో రిలీజ్ డేట్ సమస్యపై..థియేటర్ల కేటాయింపులకై దిల్ రాజు ప్రెస్ మీట్ నిర్వహించారు.
దిల్ రాజు మాట్లాడుతూ . సంక్రాంతి సినిమాల బరిలో నుంచి ఛాంబర్ కోరగానే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి టీ.జీ.విశ్వప్రసాద్, వివేక్ హీరో రవితేజ ముందుకొచ్చి తమ రిలీజ్ డేట్ ని ఫిబ్రవరి 9కి మార్చుకోవడం జరిగిన విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు అదే ఫిబ్రవరి 9కి భైరవకోన తమ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ముందు ఈ విషయం ఛాంబర్ నోటీస్ కి రాలేదు వచ్చిన వెంటనే ఏ కే ఎంటర్టైన్మెంట్స్ వాళ్లు అనిల్ సుంకర, రాజేష్ తో మాట్లాడటం జరిగింది. వారు కూడా ఛాంబర్ వినతిని మన్నించి తమ డేట్ ని ఒక వారం రోజులు అంటే 16 ఫిబ్రవరికి మార్చుకోవడం జరిగింది.
సంక్రాంతి అప్పుడు చాంబర్ వినతిని మన్నించి తమ డేట్ ని మార్చుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారికి ఇప్పుడు కూడా తమ డేట్ ని మార్చుకొని ఛాంబర్ వినితిని మన్నిస్తున్న ఏ కె ఎంటర్టైన్మెంట్స్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఫిబ్రవరి 9కి రిలీజ్ అవుతున్న ఈగల్ కి ఎక్కువ శాతం థియేటర్స్ వచ్చేలాగా చూడడం జరుగుతుంది. అదే డేట్ కి యాత్ర 2 వాళ్ళు కూడా రిలీజ్ పెట్టుకున్నారు పొలిటికల్ ఇష్యూస్ మీద డేట్ ముందే ఫిక్స్ చేసుకోవడం వల్ల వాళ్లు డేట్ ఛేంజ్ చేసుకోవడానికి ఒప్పుకోలేదు. అదేవిధంగా ఒక తమిళ్ సినిమా రజనీకాంత్ గారి గెస్ట్ రోల్లో నటించిన 'లాల్ సలాం" కూడా రిలీజ్ అవుతుంది.
ఇదే విషయాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళతో చర్చించినప్పుడు పర్లేదండి మా సినిమాతో రెండు సినిమాలు రావడం పెద్ద ఇబ్బంది కాదు అని చెప్పి వాళ్ళు అనడం చాలా ఆనందం అనిపించింది. ఫిబ్రవరి 9 కి ఈగల్ మేజర్ థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. అని చెప్పారు.