Asianet News TeluguAsianet News Telugu

విరూపాక్ష డైరెక్టర్ కి సంయుక్త మీనన్ కాస్ట్లీ గిఫ్ట్.. ఆ విషయం తెలిసిన వెంటనే కొనిచ్చిన గోల్డెన్ బ్యూటీ

రీసౌండిగ్ బ్లాక్ బస్టర్ విరూపాక్ష చిత్రంతో యువ దర్శకుడు కార్తీక్ దండు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. కార్తీక్ ప్రతిభకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఒక మిస్టరీ సస్పెన్స్ మిక్స్ చేసిన చిత్రంతో ఆడియన్స్ సీట్ ఎడ్జ్ మీద కూర్చుని ఎంజాయ్ చేసేలా విరూపాక్ష చిత్రాన్ని తీర్చిదిద్దారు.

Samyuktha menon costly gift to virupaksha director Karthik dandu dtr
Author
First Published Apr 27, 2023, 6:29 PM IST

రీసౌండిగ్ బ్లాక్ బస్టర్ విరూపాక్ష చిత్రంతో యువ దర్శకుడు కార్తీక్ దండు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. కార్తీక్ ప్రతిభకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఒక మిస్టరీ సస్పెన్స్ మిక్స్ చేసిన చిత్రంతో ఆడియన్స్ సీట్ ఎడ్జ్ మీద కూర్చుని ఎంజాయ్ చేసేలా విరూపాక్ష చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఫస్ట్ హాఫ్ లో కథని చూపించిన విధానం.. సెకండ్ హాఫ్ లో సస్పెన్స్ ని అద్భుతమైన ట్విస్టులతో రివీల్ చేసిన విధానం అందిరికి తెగ నచ్చేస్తుంది. 

ఫలితంగా ఈ చిత్రం ఆరు రోజుల్లో దాదాపు 60 కోట్ల గ్రాస్ రాబట్టింది. సాయిధరమ్ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ దిశగా దూసుకుపోతోంది. అలాగే ఈ చిత్రంలో సంయుక్త మీనన్ నటనకి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. అయితే సంయుక్త మీనన్, దర్శకుడు కార్తీక్ మధ్య జరిగిన సంఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. 

ఏదైనా చిత్రం విజయం సాధిస్తే ఆ చిత్ర నిర్మాతలు దర్శకుడికో.. నటీనటులకో గిఫ్ట్ లు ఇస్తారు. లేదా హీరో ఆ చిత్ర టెక్నీషియన్స్ కి, దర్శకుడికి గిఫ్ట్స్ ఇచ్చిన సందర్భాలు కూడా చూశాం. కానీ ఇక్కడ విరూపాక్ష చిత్ర హీరోయిన్ సంయుక్త మీనన్.. తన డైరెక్టర్ కార్తీక్ కి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిందట. ఈ విషయాన్ని సంయుక్త మీనన్ స్వయంగా వివరించింది. 

ఈ చిత్రం విడుదలైన రోజు సాయిధరమ్ తేజ్, కార్తీక్ దండు ఇద్దరూ థియేటర్స్ లో ఆడియన్స్ రెస్పాన్స్ చూసేందుకు వెళ్లారు. ప్రేక్షకుల హంగామాలో కార్తీక్ దండు ఫోన్ పోయిండట. దీనితో కార్తీక్ ని అభినందించేందుకు అతడికి ఫోన్ చేసిన చాలా మంది సెలెబ్రిటీలు రీచ్ కాలేకపోయారు. మూవీ రెస్పాన్స్ ని ట్విట్టర్ లో చూసుకుందాం అనుకున్నా కార్తీక్ దగ్గర ఫోన్ లేదు. దీనితో ఇతరుల ఫోన్ లో ఆ పని చేశారట. 

బాగా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఫోన్ పోవడం కార్తీక్ ని బాధించిందట. జరిగిన సంఘటనని సంయుక్త మీనన్ తెలుసుకుంది. సక్సెస్ హంగామా కాస్త తగ్గాక కార్తీక్ కి మంచి గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేసుకుందట. ఇంతలో అతడి ఫోన్ పోవడంతో.. వేంటనే సంయుక్త తన ప్లాన్ మార్చుకుని కార్తీక్ కోసం మంచి ఐఫోన్ ని కొని గిఫ్ట్ గా ఇచ్చినట్లు రీసెంట్ ఇంటర్వ్యూలో పేర్కొంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios