సంపూర్ణేష్ బాబు తొలి  చిత్రం హృదయకాలేయం తెలుగు పరిశ్రమపై  పూర్తి సెటైర్ తో సాగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు వస్తున్న కొబ్బరి మట్ట సైతం అలాంటిదే అని ఇప్పటికే రిలీజైన ట్రైలర్, టీజర్స్ ని బట్టి అర్దమవుతుంది.  అయితే ఆ సెటైర్ ని అక్కడితో ఆపదలుచుకోలేదు టీమ్. తాజాగా కొబ్బరి మట్ట చిత్రం ప్రీ రిలీజ్ పంక్షన్ జరిగింది. అక్కడ ఓ వ్యక్తి వచ్చి సంపూ మాట్లాడుతూంటే కాళ్లపై పడతాడు.

అందరూ షాక్.  ఆ తర్వాత ఆ వ్యక్తిని నువ్వెందుకు ఇలా చేసావు అని అడిగితే ..ప్రొడ్యూసర్ గారు చేయమన్నారు అని చెప్పాడు. ఇది చదవుతూంటే మీకు ఏం గుర్తుకు వస్తోంది. రీసెంట్ గా డియర్ కామ్రేడ్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ..ఓ వ్యక్తి వచ్చి విజయ్ దేవరకొండ కాళ్లపై పడ్డాడు. అది మీడియాలో పెద్దగా హైలెట్ అయ్యింది. వెంటనే బౌన్సర్స్ వచ్చి  అతన్ని వెనక్కి లాగటం..తర్వాత విజయ్ అతన్ని వదిలేయమని చెప్పటం జరిగింది. ఈ సంఘటన రియల్ గా జరిగిందని కొందరంటే..అదేం కాదు..కేవలం అదో స్టేజ్ ప్లే అని మరికొందరు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు. 

ఇప్పుడు కొబ్బరి మట్ట ప్రీ రిలీజ్ పంక్షన్ లో ఇలాంటి సంఘటన జరగటం..ఆ తర్వాత అది ఫన్ గా తేలిపోవటంతో ...ఇది ఖచ్చితంగా విజయ్ దేవరకొండపై సెటైర్ అంటున్నారు. ఇంతకీ విజయ్ దేవరకొండ చూస్తే ఆయన ఎలా ఫీలవుతారో...గానీ ఆయన అభిమానులు మాత్రం చిరాకు పడుతున్నారు.