బాలీవుడ్ ముద్దుగుమ్మ సమీరా రెడ్డి రెండో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. తన అరచేతిలో ఇమిడిపోయిన కూతురి చేతి వేళ్లను ఫోటోలు తీసి వాటిని అభిమానులతో షేర్ చేసుకున్నారు.

''ఈరోజే నా లిటిల్ ఏంజిల్ జన్మించింది.. మీ ప్రేమ, ఆశీస్సులకు ధన్యవాదాలు'' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  నిన్న రాత్రి ముంబై ఖర్ హాస్పిటల్ లో చేరిన సమీరా రెడ్డి ఈరోజు ఉదయమే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇటీవల అండర్ వాటర్ లో బేబీ బంప్ ఫోటోషూట్ తో రచ్చ చేసి వార్తల్లో నిలిచింది సమీరా.

ఆ తరువాత సోషల్ మీడియా, టీవీ ఛానెల్స్ లో ఆమె గురించి డిబేట్లు తెగ జరిగాయి. 2014లో అక్షయ్ వార్దే అనే బిజినెస్ మెన్ ని పెళ్లి చేసుకున్న తరువాత సినిమాలకు పూర్తిగా దూరమైంది సమీరారెడ్డి. 2015లో మగబిడ్డకు జన్మనిచ్చిన ఈమె ఈసారి ఆడబిడ్డను జన్మించింది.