సమంత నటించిన యశోద చిత్రం పాన్ ఇండియా మూవీగా నవంబర్ 11న రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

సమంత నటించిన యశోద చిత్రం పాన్ ఇండియా మూవీగా నవంబర్ 11న రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఆదిత్య 369 నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ యశోద చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఇంటర్వ్యూలో కృష్ణ ప్రసాద్ యశోద చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

సమంత ప్రస్తుతం మయోసైటిస్ కారణంగా విశ్రాంతి తీసుకుంటోంది. దీనితో సమంత ప్రచార కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. యశోద బిజినెస్ భారం మొత్తం సమంత క్రేజ్ పైనే ఉంది అని చెప్పాలి. కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ మొదట ఈ చిత్రానికి 2 నుంచి 3 కోట్ల బిజినెస్ అనుకున్నారట. స్క్రిప్ట్ విన్నాక ఇది తక్కువ బడ్జెట్‌లో చేయాల్సిన సినిమా కాదని, దాని బడ్జెట్‌ పెంచారట నిర్మాత. అలాగే కాస్టింగ్‌ని కూడా పెంచారట. అలా సమంత ఇందులోకి వచ్చిందని చెప్పారు నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్‌.

కానీ సమంత వచ్చాక ఈ ప్రాజెక్టు స్వరూపమే మారిపోయింది. బడ్జెట్ ఏకంగా 40 కోట్లు దాటిపోయింది. హరీష్ హరి వినిపించిన స్క్రిప్ట్ నాకు నచ్చింది. కొన్ని చేంజెస్ సూచించాను. ప్రస్తుతం అవుట్ ఫుట్ చూశాక చాలా రిలాక్స్ గా ఉన్నా. సినిమా బడ్జెట్ 40 కోట్లు దాటినప్పటికీ సమంత క్రేజ్ కారణంగా ప్రీరిలీజ్ బిజినెస్ తోనే నిర్మాతలకు లాభాలు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. యశోద ఓటిటి హక్కులకు దిగ్గజ సంస్థ నుంచి 40 కోట్ల ఆఫర్ వచ్చినట్లు టాక్. 

యశోద చిత్రం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ ని సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టడం ఖాయం అని అంటున్నారు. నిర్మాత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ సమంత తన పెద్ద కుమార్తె లాంటిది. ఆమెతో కలసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. బిజినెస్‌ పరంగా తాము ఇప్పటి వరకు సేఫ్‌లో ఉన్నామని, ఎలాంటి టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదన్నారు. అన్ని ఏరియాల్లో ఆల్మోస్ట్ తామే సొంతంగా రిలీజ్‌ చేస్తున్నామని తెలిపారు.