హీరోయిన్ సమంత పెళ్లి పీటలు ఎక్కనుంది. అయితే ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాలి. 

సమంత మయోసైటిస్ నుండి కోలుకున్నారు. తిరిగి ఆమె షూటింగ్స్ లో బిజీ అయ్యారు.సమంత కారణంగా ఖుషి చిత్ర షూట్ కి తాత్కాలిక విరామం ఏర్పడింది. ఇటీవల తిరిగి ప్రారంభమైంది. ఈ చిత్ర వర్కింగ్ స్టిల్స్ కొన్ని బయటకు రాగా ఆమె తాళిబొట్టుతో కనిపించారు.దీంతో ఖుషి మూవీలో సమంత పెళ్ళైన యువతి పాత్ర చేస్తున్నారంటున్నారు. విజయ్ దేవరకొండ భార్యగా ఆమె కనిపించనుంది. ఆ విధంగా రీల్ లైఫ్ లో సమంత పెళ్లి పీటలు ఎక్కబోతుందని సమాచారం. 

దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ షూటింగ్ చివరి దశకు చేరినట్లు సమాచారం. మరో రెండు మూడు నెలల్లో థియేటర్స్ లో దిగే సూచనలు కలవు. మరోవైపు సమంత నటించిన పౌరాణిక చిత్రం శకుంతల విడుదల కావాల్సి ఉంది. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం విడుదల రెండు సార్లు వాయిదా పడింది. దిల్ రాజు వంటి స్టార్ ప్రొడ్యూసర్ నిర్మించిన చిత్రానికి విడుదల కష్టాలు ఏంటో అర్థం కావడం లేదు.

అలాగే సమంత సిటాడెల్ షూట్లో పాల్గొంటున్నారు. వరుణ్ ధావన్ మరో ప్రధాన పాత్ర చేస్తుండగా ది ఫ్యామిలీ మాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. సిటాడెల్ ఫస్ట్ షెడ్యూల్ ముంబైలో జరిగింది. అనంతరం నార్త్ ఇండియాలో చిత్రీకరణ జరిపారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని నైనిటాల్ లో సిటాడెల్ కి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. నెక్స్ట్ షెడ్యూల్ విదేశాల్లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సౌత్ ఆఫ్రికాతో పాటు పలు దేశాల్లో సిటాడెల్ షూట్ జరపనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు.

ఇక హీరోయిన్ సమంత సర్కిల్ మారిపోయింది. ఆమెకు బాలీవుడ్ ప్రముఖులతో పరిచయాలు పెరిగాయి. ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ అనంతరం హిందీ చిత్ర పరిశ్రమలో ఆమె పాపులర్ అయ్యారు. ఎక్కువ సమయం అక్కడే గడుపుతున్నారు. ముంబైలో సమంత ఖరీదైన ఇల్లు కొన్నట్లు సమాచారం. ఏకంగా హైదరాబాద్ నుండి మకాం ముంబైకి మార్చేస్తుందంటూ వార్తలు వచ్చాయి.