ప్రముఖ సినీ నటుడి ప్రవర్తన కారణంగా టాలీవుడ్ లో చాలా మంది ఇబ్బంది పడుతున్న వార్త బయటకొచ్చింది. ఇప్పటికే చాలా మంది నటులు ఆయన ప్రవర్తన కారణంగా విసిగిపోయారు. సీనియర్ కావడంతో సినిమా సెట్స్, షూటింగ్ సమయంలో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండడంతో చాలా మంది దర్శకులు ఇబ్బంది పడుతున్నారట.

సదరు నటుడు గతంలో హీరోగా ఎన్నో సినిమాలు చేశారు. కామెడీ హీరోగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి ఎన్నో సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల పెద్ద సక్సెస్ అయిన ఓ సినిమాలో కీలక పాత్ర పోషించాడు.

అయితే ఇప్పుడు ఈ నటుడి కారణంగా సమంత కూడా ఇబ్బందిపడుతున్నట్లు తెలుస్తోంది. సమంత హీరోయిన్ గా లేడీ ఓరియెంటెడ్ మూవీ 'బేబీ' అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సదరు సీనియర్ నటుడు ఓ పాత్ర పోషిస్తున్నాడు.

ఇటీవల అతడు సెట్స్ కి తాగొచ్చి.. సమంతకు సంబంధించిన డైలాగ్స్ విషయంలో ఇన్వాల్వ్ అవుతూ కాస్త అతి చేసినట్లు సమాచారం. అతడి ప్రవర్తనతో విసిగిపోయిన సమంత, అలానే సినిమా డైరెక్టర్ సీనియర్ నటుడి పాత్రని వీలైనంతగా తగ్గించాలని చూస్తున్నారు.