బిగ్ బాస్ సీజన్ 4 అనుకున్నంత ఆదరణ దక్కించుకోవడం లేదు. షో టీఆర్పీ కూడా చాలా దారుణంగా ఉంది. ప్రేక్షక ఆదరణ పొందిన సీరియల్స్ కంటే కూడా అతి తక్కువ టీఆర్పీ బిగ్ బాస్ షోకి రావడం ఆందోళన కలిగిస్తుంది. కనీసం టు డిజిట్ టీఆర్పీ కూడా బిగ్ బాస్ షో దక్కించుకోలేక పోతుంది అట. ఈ నేపథ్యంలో షోకి హైప్ తీసుకురావడానికి నిర్వాహకులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. 

దీనిలో భాగంగా బిగ్ బాస్ హోస్ట్ గా హీరోయిన్ సమంత రంగంలోకి దిగనుంది. దసరా పండుగను పురస్కరించుకొని బిగ్ బాస్ షో హోస్ట్ గా సమంత వ్యవహరించనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన స్టార్ మా విడుదల చేసింది.రేపు ఆదివారం ప్రసారం కానున్న షోకి హోస్ట్ గా సమంత వ్యవహరించ నుండి.  నటిగా మాత్రమే తెలిసిన సమంత బిగ్ బాస్ హోస్ట్ గా ఏ స్థాయిలో అలరించనుంది అనే ఆడియన్స్ లో ఆసక్తికి పెరిగిపోయింది. 

ఆదివారం ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ కోసం సమంత ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. హీరోయిన్ గా స్టార్ హోదా అందుకున్న సమంత హోస్ట్ గా ఇరగదీయడం ఖాయం అంటున్నారు. సమంత తన క్యూట్ మాటలతో ఈ స్థాయిలో అలరించనుందో చూడాలి. ఇక సమంత పెద్దగా సినిమాలు ఒప్పుకోవడం లేదు. తెలుగులో ఒక్క సినిమాకు కూడా సమంత సైన్ చేయలేదు. ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో నటిస్తున్న సమంత, ఓ తమిళ చిత్రం చేస్తున్నట్లు సమాచారం.