సామ్ ఎలాంటి సినిమా ఒప్పుకుందో తెలుసా..?

First Published 3, Aug 2018, 2:42 PM IST
samantha to work with director nandini reddy
Highlights

 నాలుగేళ్ల క్రితం వచ్చిన కొరియన్ మూవీ 'మిస్ గ్రానీ' అనే సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ వృద్ధురాలి పాత్రలో కనిపిస్తూనే.. తనకున్న అతీత శక్తులను ఉపయోగిస్తూ అవసరమైనప్పుడు అందమైన అమ్మాయిగా మారిపోతుంటుంది

సాధారణంగా హీరోయిన్లు తమ వయసుకి మించి పాత్రల్లో నటించాలంటే ఆలోచనలో పడతారు. అలాంటిది ఆంటీ, అమ్మమ్మ పాత్రలంటే ఆమడదూరం పారిపోతుంటారు. అలాంటిది నటి సమంత 70 ఏళ్ల వృద్ధురాలి పాత్రలో కనిపించడానికి సిద్ధమైందని సమాచారం. పెళ్లి అనంతరం సినిమాలకు దూరమవుతుందనుకున్న సమంత రెట్టింపు స్పీడ్ తో సినిమాలు సైన్ చేస్తోంది. ఈ ఏడాది రంగస్థలం, అభిమన్యుడు చిత్రాలతో సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం 'యూటర్న్' సినిమాలో నటిస్తోంది.

అలానే దర్శకుడు శివ నిర్వాణతో మరో సినిమా చేయడానికి అంగీకరించింది. తాజాగా ఆమె లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి చెప్పిన కథతో సినిమా చేయాలనుకుంటున్నట్లు సమాచారం. ఇక్కడ ఆసక్తికర విషయమేమిటంటే.. ఈ కథ ప్రకారం హీరోయిన్ 70 ఏళ్ల వృద్ధురాలిగా కనిపించబోతుందట. నాలుగేళ్ల క్రితం వచ్చిన కొరియన్ మూవీ 'మిస్ గ్రానీ' అనే సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో హీరోయిన్ వృద్ధురాలి పాత్రలో కనిపిస్తూనే.. తనకున్న అతీత శక్తులను ఉపయోగిస్తూ అవసరమైనప్పుడు అందమైన అమ్మాయిగా మారిపోతుంటుంది. ఇలాంటి పాత్రలో నటించడానికి సమంత ఆసక్తిగా ఉందని సమాచారం. విభిన్న కథల కోసం చూస్తోన్న సామ్ ను ఈ కథ బాగా ఆకట్టుకోవడంతో సినిమా చేయాలని భావిస్తోంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సివున్నాయి!  

loader