ఇష్టమైన వారికి అంతా మంచే జరగాలని, నవ్వుతూ ఉండే శుభసంతోషాలు అలాగే లాభాలు కలగాలని శ్రేయోభిలాషులు కోరుకుంటారు. అదే జీవితాంతం తోడుండే శ్రీమతి అయితే భర్తకోసం దేవుడితో అయినా పోట్లాడేస్తుంది. పేదింటి స్త్రీ అయినా గొప్పింటి మోడ్రన్ గర్ల్ అయినా భర్త సంతోషం తప్ప ఇంకేం కోరుకుంటుంది. 

అలానే సమంత కూడా నాగ చైతన్య గురించి నిత్యం ఆలోచిస్తూనే ఉంటుంది. ఆరేళ్లకు పైగా ప్రేమలో ఉండి గత ఏడాది పెళ్లి బంధంతో ఒకటైన ఈ జంట అందరిని ఆకట్టుకుంటోంది. ఇకపోతే ప్రస్తుతం చైతూ కెరీర్ చాలా వరకు క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. యుద్ధం శరణం డిజాస్టర్ ఆ తరువాత శైలజారెడ్డి అల్లుడు మొదట్లో కొంత హడావుడి చేసినా ఆ తరువాత డౌన్ అయ్యింది. 

ఇక భారీ అంచనాలతో వచ్చిన సవ్యసాచి మొదటిరోజే హ్యాండ్సప్ అనేసింది. అయితే సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా చైతూ పెద్దగా పట్టించుకోడు గాని సమంత మాత్రం తెగ వర్రీ అవుతున్నట్లు మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. ఎలాగైనా నెక్స్ట్ సినిమాతో చైతూకి సక్సెస్ ఇవ్వాలని తనవంతు కృషి చేస్తోందట. 

ఈ ఇద్దరు పెళ్లి తరువాత నటిస్తోన్న మొదటి చిత్రం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. క్యూట్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా రానున్న ఈ సినిమా షూటింగ్ లో సమంత గ్యాప్ లేకుండా పాల్గొంటోంది. తనకు సంబందించిన సన్నివేశాలు లేకపోయినప్పటికీ దర్శకుడితో ప్రతి సీన్ ను చెక్ చేస్తుందట. 

స్పెషల్ షెడ్యూల్ కి ముందు చిత్ర యూనిట్ తో ఆమె స్పెషల్ గా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. చైతూకి జోడిగా కనిపించి మళ్ళీ హిట్ ట్రాక్ లోకి ఎక్కించాలని సమంత తాపత్రయపడుతోంది. మరి ఆ ప్లాన్స్ ఎంతవరకును వర్కౌట్ అవుతాయో చూడాలి.