సమంత క్రేజ్ రోజు రోజుకీ పెరుగుతోంది.ముఖ్యంగా ఓ బేబి హిట్టయ్యాక తను సొంత క్రేజ్ తో సినిమాలను ఆడించగలనని ప్రూవ్ చేసుకుంది. ఈ నేపధ్యంలో ఆమెతో మరో హీరోయిన్ ఓరియెంటెండ్ సినిమా ఓకే చేసినట్లు సమాచారం. ఇది సమంత త్వరలో బిడ్డను కనబోతోందంటూ ప్రచారం చేస్తున్న వారికి కౌంటర్ ఇచ్చినట్లైంది. ఆమె తాజాగా కొత్త చిత్రం ఓకే చేయటమే కాక , వరస పెట్టి సినిమాలు ఓకే చేస్తోంది. తాజాగా ఆమె సోనీ పిక్చర్స్ వారు తెలుగు,తమిళంలో చేసే సినిమాని సైన్ చేసినట్లు సమాచారం.

ఇంతకీ ఈ సినిమాకు దర్శకుడు ఎవరూ అంటే ..ఆ మధ్యన తాప్సీతో గేమ్ ఓవర్ అనే సినిమా తీసిన డైరక్టర్. గేమ్ ఓవర్ సినిమా ఆడకపోయినా మంచి పేరు తెచ్చుకుంది. దర్శకుడు అశ్విన్ శరవణ్ కు ఓ వర్గంలో మంచి గుర్తింపు వచ్చింది. ఈ నేపధ్యంలో అతను సోనీ పిక్చర్స్ వారికి కథ చెప్పటం, వాళ్లు ఓకే చేసి సమంతతో సినిమా చేయాలని ఫిక్స్ అవటం జరిగింది. సోనీ పిక్చర్స్ ద్వారా ...సమంతను ఎప్రోచ్ అయ్యి కథను చెప్పి ఒప్పించుకున్నాడు దర్శకుడు అశ్విన్. అదీ ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అని తెలుస్తోంది. అయితే ఆ సినిమా సమంతకు బ్రేక్ ఇస్తుందా లేదా అంటే..గేమ్ ఓవర్ సినిమాతో తాప్సీకి కలిసొచ్చిందేమీ లేదు. అలా జరగ్గకుండా ఉండాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
  
ఇక రీసెంట్ గా శర్వా తో చేసిన జాను చిత్రం నిరాశపరచటంతో సమతం ఏ ప్రాజెక్టు సైన్ చేయాలా అనే సందిగ్దంలో ఉంది. పెద్ద హిట్టైన రీమేక్ సైతం డిజాస్టర్ అవటం ఆమెను బాగా డిజప్పాయింట్ చేసింది. దానికి తోడు ఆమెను వివాహానంతరం ..పెద్ద హీరోలెవరూ తమ సరసన తీసుకోవటానికి ఉత్సాహం చూపించటం లేదు. మెల్లిగా ఆఫర్స్ తగ్గిపోతున్నాయి. దాంతో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల వైపే ఆమె మ్రొగ్గు చూపుతోంది.