సమంత అక్కినేని, నందినీ రెడ్డి కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రం  'ఓ బేబి'. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ వారం రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో సమంతతో పాటు సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మి కూడా కీల‌క పాత్ర‌లో న‌టించారు.  ఈ చిత్రంపై సమంత చాలా హోప్స్  పెట్టుకుంది.

కొరియన్ సినిమా మిస్ గ్రానీ రీమేక్ గా వస్తున్న ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ కామెడీగా సాగుతుంది. అయితే సినిమాలో మెయిన్ కంటెంట్ ఓ డబ్బై సంవత్సరాల ముసలామె..చిన్న వయస్సుకు మారిపోవటం అనేది మేజిక్ గా జరుగుతుంది. ఆ మారటం అనేది ఓ ఫొటో స్టూడియోకు వెళ్లినప్పుడు జరుగుతుంది. అది కనుక జనాలకు ..ఇదేంటి ఇలా జరిగింది అని అనుకోకుండా లీనమై చూస్తే సినిమా హిట్ అంటున్నారు.

సమంత చాలా బాగా నటించిందని అని చెప్తున్నారు. కామెడీ చాలా బాగా చేసిందని, స్క్రిప్టు కూడా ఒరిజనల్ ని బాగా ఇంప్రవైజ్ చేసి తెరకెక్కించారని వినికిడి. ముఖ్యంగా మల్టిఫ్లెక్స్ లు, ఎ సెంటర్లలో బాగా ఆడుతుందని చెప్తున్నారు. ఈ టాక్ నిజమైతే టాలీవుడ్ లో మరో జెన్యూన్ హిట్ వచ్చినట్లే.

 ఈ చిత్రంలో  ల‌క్ష్మి, రావు ర‌మేష్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ప్ర‌గ‌తి  రావు ర‌మేష్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, ప్ర‌గ‌తి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. సాంకేతిక వ‌ర్గం: మ్యూజిక్‌:  మిక్కి జె.మేయ‌ర్‌, కెమెరా:  రిచ‌ర్డ్ ప్ర‌సాద్ , డైలాగ్స్‌: ల‌క్ష్మీ భూపాల్‌, ఎడిట‌ర్‌:  జునైద్ సిద్ధిఖీ, ప్రొడ‌క్ష‌న్ , డిజైన్‌:జ‌య‌శ్రీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌, నిర్మాత‌లు:  సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, హ్యువు థామ‌స్ కిమ్ ,ఆర్ట్‌:  విఠ‌ల్‌.కె, ద‌ర్శ‌క‌త్వం:  బి.వి.నందినీ రెడ్డి, నిర్మాణ సంస్థ‌లు:  సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, గురు ఫిలింస్‌, క్రాస్ పిక్చ‌ర్స్‌, స‌హ నిర్మాత‌లు:  విజ‌య్ దొంకాడ‌, దివ్యా విజ‌య్‌.